Begin typing your search above and press return to search.
పరుగుల మెషిన్.. మరో అరుదైన రికార్డ్
By: Tupaki Desk | 2 Dec 2020 1:16 PM ISTపరుగుల మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మార్క్ ను అందుకున్న బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. ఎన్నో ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ అందుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేపట్టింది.
ఈ మ్యాచ్లో కోహ్లీ 63 పరుగులు చేయగా ఓవరాల్ గా వన్డేల్లో అతడి పరుగులు 12 వేల మార్క్ కు చేరుకుంది. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరిన క్రికెటర్ గా కోహ్లీ గుర్తింపు పొందాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ 300 ఇన్నింగ్స్ లో 12 వేల పరుగులు సాధించగా.. కోహ్లీ తన 242 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డ్ అందుకున్నాడు.
2008లో శ్రీలంకతో జరిగిన వన్డే లో అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటివరకు 43 సెంచరీలు 59 అర్థ సెంచరీలు చేశాడు. సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మెన్ గా కూడా కోహ్లీ గుర్తింపు సాధించాడు. సచిన్ 463 వన్డేలు ఆడి 18, 426 పరుగులు సాధించాడు. సచిన్ తర్వాత అంతటి గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ వరుసగా సచిన్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొడుతున్నాడు. 11 వేల పరుగుల మార్క్ ని కూడా కోహ్లీ 222 ఇన్నింగ్స్ లోనే అందుకున్నాడు.