Begin typing your search above and press return to search.

కరోనాకు విరుగుడు ఇదేనట?

By:  Tupaki Desk   |   24 March 2020 3:00 PM IST
కరోనాకు విరుగుడు ఇదేనట?
X
వెనుకటికి గత్తరొస్తే (క్షయ - ఫ్లూ వ్యాధులు) ఊళ్లకు ఊళ్లు చనిపోయాయని... అందరూ కోళ్లు, మేకలు , గొర్రెలు కోసుకుతిన్నారని మన తండ్రులు, తాతలు చెబుతుంటే విన్నాం. అప్పుడే గ్రామ దేవతలు పెట్టి ప్రతిష్టించి పూజలు చేస్తే గత్తెర తగ్గిందని చెబుతుంటారు..

ఇప్పుడు అలాంటి గత్తెర వ్యాధినే (కరోనా వైరస్) వచ్చింది. ప్రపంచమంతా వణికిపోతోంది. ఇప్పటికే 15వేల మందికిపైగా మరణించగా.. 60వేల మందికిపైగా సోకింది. దేశంలోనూ భారీగా విస్తరిస్తోంది. అందరూ ప్రాణభయంతో ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇప్పటివరకు కరోనాకు మందు కనిపెట్టకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది.

ఎవరికి వారు కరోనాపై అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్ గా మారింది.

కరోనా సోకకుండా.. తమ కొడుకులకు అంటకుండా ఐదు బిందెల నీటిని తీసుకొచ్చి వేపచెట్టుకు పోసి కొబ్బరి కాయలు కొట్టి.. దీపాలు ముట్టిస్తే వ్యాధి దరిచేరదని ప్రచారం మొదలైంది. దీన్ని మహిళలు నమ్ముతూ వేపచెట్టుకు నీళ్లు పోస్తున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ తంతు నిర్వహిస్తున్నారు. ఈ ఆచారం వైరల్ గా మారింది.

ఉత్తర తెలంగాణ అంతటా ఇది పాకింది. గ్రామాల్లో ఈ వ్యాధి భయంతో ఇప్పుడు వేపచెట్టుకు నీళ్లు పోసే కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఆధునిక యుగంలోనూ ఇంతటి భయానక వాతావరణంలో ఈ ఆచారం పాటించాలంటూ కొందరు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించకుండా ఇలా వేపచెట్టుకు నీళ్లు పోస్తున్నారు.