Begin typing your search above and press return to search.

గోవా వెళ్లాలనుకుంటున్నారా .. అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే !

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:09 PM IST
గోవా వెళ్లాలనుకుంటున్నారా .. అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే !
X
గోవా రోడ్ ట్రిప్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కార్ లేదా బైక్ లో స్నేహితులతో కలిసి కొందరు లాంగ్ వీకెండ్ ట్రిప్ లను ప్లాన్ చేస్తుంటారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప ప్రయాణ అనుభవాలను అందిస్తుంది. దక్షిణ భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాల నుండి గోవా పర్యటనకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. సాధారణంగా అయితే పర్యాటక ప్రాంతాలు ఎప్పుడు పర్యాటకులతో కళకళలాడుతుంటాయ్. కానీ కరోనా వైరస్ కారణంగా పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. కొంత మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇక పర్యాటకులపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఉండడం గమనార్హం.

దీంతో వివిధ పర్యటనలకు వెళ్లాలి అని ప్లాన్ చేసుకుంటున్న ఎంతోమంది నిరాశ చెందుతున్నారు. దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం భారత్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గోవా బీచ్ కూడా ఒకటి. అందమైన గోవా బీచ్ లో ఎంజాయ్ చేయడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కేవలం యువత మాత్రమే కాదు అటు అన్ని వయసుల వారు కూడా గోవా బీచ్ కి వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అందమైన గోవా బీచ్ లో తిరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానించాలని అనుకుంటారు.

ప్రపంచ పర్యాటకంలో గోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సుందరమైన గమ్యస్థానాన్ని సందర్శించాలనుకునే వారు ముందుగా అక్కడి పర్యాటక ప్రదేశాల గురించి ఆరా తీస్తుంటారు. అలాగే ప్రస్తుతం పరిస్థితులలో గోవాలో కరోనా నిబంధనలు అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు కొత్త ఎస్ ఓపిలు, ఆర్ టి పిసిఆర్ నెగిటివ్ రిపోర్ట్స్ తప్పనిసరిగా ఉండాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. సముద్ర తీర ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా ఆర్ టి పిసిఆర్ పరీక్ష రిజల్ట్ చూపించాలని అలాగే ఫస్ట్, సెకండ్ డోసు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ కూడా తమ వెంట ఉండాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివిటీ రేటు 1.8 రేటు నుంచి 2 శాతంగా ఉంది. గోవాకు వచ్చే పర్యాటకులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేదా, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రమోద్ కోవిడ్ టూరిజం నియమ నిబంధనలు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గోవాలో కొత్తగా 97 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,71,705 కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 133 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. రికవరీల సంఖ్య 1,67,556 కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 3,157కి పెరిగింది. ప్రస్తుతం గోవాలో 992 యాక్టివ్ కేసులు ఉన్నాయి.