Begin typing your search above and press return to search.

మద్యం తాగి బట్టలిప్పేసి తిరుగుతున్న అధికార పార్టీ లీడర్..

By:  Tupaki Desk   |   25 Feb 2022 3:43 AM GMT
మద్యం తాగి బట్టలిప్పేసి తిరుగుతున్న అధికార పార్టీ లీడర్..
X
ఆయనో అధికార పార్టీ లీడర్... ఆడిందే ఆట.. పాడిందే పాట.. దీంతో ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నాడు.. ఫుల్లుగా మద్యం తాగుతూ రోడ్డుమీద హంగామా చేస్తున్నాడు.. అంతేకాకుండా తన శరీరం మీద ఉన్న బట్టలన్న తీసేసి రభస చేస్తున్నాడు.. కొందరు ఇదేంటని అడిగితే వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరంగం సృష్టిస్తున్నాడు.. దీనికి సంబంధించి కొందరు వీడియోలు తీశారు.. సోషల్ మీడియాలో పెట్టారు.. అవి వైరల్ కావడంతో విషయం సీఎం దాకా వెళ్లింది.. అధికార పార్టీలో ఉన్న లీడర్ ఇలా చేయడంపై ప్రభుత్వంలో ఉన్న సీఎం షాక్ తిన్నాడు.. ఇక ప్రతిపక్షాలు ఏం చేస్తారో.. అందరకీ తెలిసిందే.. దీంతో ఆ పార్టీకి చెందిన ప్రజాపప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే..?

బీహార్ లో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీ అండతో జేడీఎస్ నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల తన పార్టీకి చెందిన ఓ బలమైన నాయకుడు ఇలాంటి పని చేయడం చూసి షాక్ తిన్నారట. అయనెందుకు అలా చేస్తున్నాడో.. ఆరా తీయాలని కింది స్థాయి నాయకులను ఆదేశించాడట. రాష్ట్రంలోని నలంద జిల్లాలోని ఇస్లాంపుర శాసన నియోజకవర్గంలో జయప్రసాద్ అనే జేడీఎస్ లీడర్ ఉన్నాడు. ఈ నియోజకవర్గంలోనే ప్రసాదరావు పేరున్న వ్యక్తి. అంతేకాకుండా అధికార పార్టీ అండదండలతో హల్ చల్ సృష్టిస్తాడు. పార్టీ యూత్ విభాగం నాయకుడిగా ఉన్న జయప్రసాదరావు ఆగడాలు ఇటీవల మరింత ఎక్కువయ్యాయి.

వారంలో నాలుగు రోజుల పాటు మద్యం సేవిస్తున్న జయప్రసాద్.. అంతటితో ఆగడం లేదు. రోడ్డుపై హంగామా సృష్టిస్తున్నాడు. బాగా తాగిన తరువాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే తనకు తాను వెళితే ఇక్కడ సమస్య రాదు. కానీ ఆ తరువాత మెల్లగా తన శరీరంపై ఉన్న దుస్తులను తొలగించేస్తున్నాడు. ముందుగా ప్యాంట్ విప్పేస్తున్నాడు. ఆ తరువాత షర్ట్ తీసేసి.. చివరగా మిగతా దుస్తులన్ని తొలగిస్తున్నాడు. ఇలా పూర్తిగా నగ్నంగా రోడ్డుపై తిరుగుతూ వీరంగం సృష్టిస్తున్నాడు.

జయప్రసాద్ రావు ఇలా చేయడంతో అటువైపు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రయిందంటే చాలు మహిళలు ఇళ్లలోనుంచి బయటకు రావాలంటే బయపడుతున్నారు. అయితే కొందరు ఆయన చేసే తతంగంపై వీడియోలు తీశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. అవి కొద్ది సేపటికే వైరల్ అయ్యాయి. దీంతో ఆ వీడియోలు సీఎం నితిశ్ కుమార్ వరకు వెళ్లింది. దీంతో ఏం చేయాలో తెలియక సీఎంతో సహా ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. అయితే ఆర్జేడీ నాయకుడు తన్వీర్ అలం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జయప్రసాదరావుపై న్యూసెన్స్ కేసు నమోదైంది.

అధికార పార్టీకి చెందిన నాయకుడు ఇలా చేయడంపై ప్రతిపక్సాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని అంటున్నారు. అయితే అధిష్టానం ఈ విషయం తెలిసినా ఏం చేయలేకపోతుందని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తున్నారు. అయితే జయప్రసాదరావు కేవలం ఇలాంటివే కాకుండా తన నియోజకవర్గంలో పట్టు సాధించడం కోసం అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటారన్న విమర్శలు ఉన్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పార్టీ బలం చూపిస్తాడని ఆరోపిస్తున్నారు.

కానీ ఆయన ఇలా మద్యం తాగి రోడ్డుమీద హంగామా చేసిన విషయం పార్టీ అధిష్టానం సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలోనని సమీక్ష చేస్తున్నారు.