Begin typing your search above and press return to search.
కరోనాపై ఎగతాళి చేస్తే ఏమైందో చూడండి
By: Tupaki Desk | 13 March 2020 6:09 PM ISTనవ్విన నాపచేనే పండునంటారు. కరోనాను చూసి నవ్వి జోకులు పేల్చిన వారు ఇప్పుడు వాటికే బలి అయిన పరిస్థితిని చూస్తున్నాం. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం అందరికీ ఫోన్లు చేస్తుంటే ‘దగ్గుతో మొదలయ్యే రింగ్ టోన్ వినిపిస్తే అందరం నవ్వుకున్నాం.. ‘ఎంట్రోయ్.. దగ్గుతున్నావ్... కరోనా వచ్చిందా’ అని ఫోన్ ఎత్తిన అవతలి వారిని ఎగతాళి చేశాం. ఇక ఈ దగ్గు మీద దేశంలో ఎన్నో మీమ్స్, సెటైర్లు, జోకులు సోషల్ మీడియాలో పడ్డాయి.
కానీ అదే కరోనా మన దేశానికి రావడం.. వ్యాపించడం చూశాక ఇప్పుడందరూ హడలి చస్తున్నారు. ఇలానే అమెరికన్ ప్రఖ్యాత బాస్కెట్ బాల్ ప్లేయర్ రూడీ గోబర్డ్ కూడా చైనాలో కరోనా సోకి ప్రాణాలు పోతుంటే అమెరికాలో ప్రెస్ మీట్ లో ఎగతాళి చేశాడు. మైక్ లు పట్టుకొని అమ్మో కరోనా సోకిందా అంటూ విలేకరుల ప్రశ్నలకు ఎగతాళి చేశాడు. కానీ ఇప్పుడు అతడే కరోనా బారినపడ్డట్టు తెలిసింది.
ప్రఖ్యాత క్రీడాకారుడు కరోనా బారిన పడడం.. అమెరికా అంతటా కరోనా భారీగా వ్యాపించడంతో ప్రఖ్యాత ఎన్బీయే లీగ్ ను నిర్వాహకులు రద్దు చేసేశారు. ట్రంప్ సహా చాలా మందికి కరోనా పరీక్షలు కూడా చేస్తున్నారు. అమెరికాలోనూ వేగంగా కరోనా వ్యాపిస్తోంది.
ఇలా ఎగతాళి చేసిన బాస్కెట్ బాల్ క్రీడాకారుడు ఇప్పుడు ఆ వైరస్ కే గురికావడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఏదైనా మనదాకా వస్తే కానీ జనాలకు తెలియదు అన్న దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పకతప్పదు.