Begin typing your search above and press return to search.

దారుణం.. ఆర్టీసీలో 1000 కోట్లు మాయం..!

By:  Tupaki Desk   |   10 Oct 2019 9:37 AM GMT
దారుణం.. ఆర్టీసీలో 1000 కోట్లు మాయం..!
X
దసరా తెలంగాణలోనే పెద్ద పండుగ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పండుగ పూట వారికి జీతాలు లేక పస్తులుండాల్సిన పరిస్థితి. అన్నీ భరించిన ఆర్టీసీ కార్మికులకు మరో మోసం వెలుగు చూడడం దిగ్ర్భాంతి కలిగించింది. తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు మరో షాక్ తగిలింది..

తెలంగాణ ఆర్టీసీ పీఎఫ్ ఖాతా నుంచి దాదాపు వెయ్యికోట్లు మాయం అయినట్లు గుర్తించారు.కార్మికుల వేతనం నుంచి ప్రతీనెల ఉద్యోగి భద్రత కోసం పీఎఫ్ పేరుతో కొంత మొత్తం వసూలు చేస్తారు.దీనికి ఆర్టీసీ యాజమాన్యం కొంత మొత్తం జత చేస్తుంది.అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.826 కోట్లను పీఎఫ్ ఖాతాకు జమ చేయకుండా వాడేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా పీఎఫ్ నగదు కోసం దరఖాస్తు చేస్తున్న వారివి పెండింగ్ లో పెడుతున్నారు. దాదాపు 7వేల దరఖాస్తులు ఇలా పెండింగ్ లో పడిపోయాయి. దీనిపై ఆరాతీయగా దాదాపు వెయ్యి కోట్ల మాయం అయినట్టు వెలుగుచూసిందట..

పీఎఫ్ కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ట్రస్టు ఖాతాలో కూడా సొమ్ము జమ కాలేదని విచారణలో తేలిందట.. పీఎఫ్ సొమ్ము రూ.826 కోట్లు, ట్రస్టు ఖాతాలో సొమ్ము మొత్తం వెయ్యి కోట్లపైనే మాయం అయినట్టు తేలిందట..

తాజాగా ఆర్టీసీ పీఎఫ్ సొమ్ము ఏళ్ల తరబడి జమ కాకపోవడంతో పీఎఫ్ కమిషనర్ రెండుసార్లు ఆర్టీసీకి షోకాజ్ నోటీసులు పంపారు. దీంతో విషయం వెలుగుచూసింది. ఆర్టీసీ యాజమాన్యమే కార్మికులకు పీఎఫ్ సొమ్ము బదలాయించలేదని సమాచారం. కోర్టు నుంచి స్టే తెచ్చుకొని మరీ దీన్ని ఆపేసిందట.. రెండేళ్ల నుంచి కార్మికులకు పీఎఫ్ సొమ్ము విత్ డ్రాయల్స్ నిలిచిపోయాయి. ఆర్టీసీ సంస్థనే ఇలా తమ పీఎఫ్ సొమ్మును ఇతర అవసరాలకు మల్లించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. వెయ్యి కోట్లు వాడేసుకున్న ఆర్టీసీపై భగ్గుమంటున్నారు.