Begin typing your search above and press return to search.

ఆర్టీసీ కీలక నిర్ణయం.. ప్రయాణాలు ఇప్పటినుంచే?

By:  Tupaki Desk   |   9 May 2020 7:10 AM GMT
ఆర్టీసీ కీలక నిర్ణయం.. ప్రయాణాలు ఇప్పటినుంచే?
X
మే 17తో కేంద్రం విధించిన లాక్ డౌన్ కు తెరపడబోతోందని సంకేతాలు అందుతున్నాయి. అన్ని వ్యవస్థలను ఈనెల 17 తర్వాత ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోందట.. కరోనా-లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి మూతపడ్డ అన్ని వ్యవస్థల్లో కీలకమైన ప్రజా రవాణాను కూడా ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని సమాచారం.

కేంద్రం నుంచి సంకేతాలు అందడంతో ఏపీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రధానంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుబోతోంది. కండక్లర్ల వ్యవస్థను పక్కనపెట్టి బస్టాండులు, బస్ స్టాపుల వద్దే వారిని కూర్చుండబెట్టి టికెట్ ఇప్పించాలని యోచిస్తోంది. తద్వారా బస్ కండక్టర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని భావిస్తున్నారు.

ఇక కరోనా దెబ్బకు స్టాప్ ల సంఖ్యను కుదించేస్తోంది. 150కి.మీల దూరం పైన ప్రయాణించే బస్సుల్లో ఆన్ లైన్ ద్వారానే టికెట్లు తీసుకోవాలి. ఇక 150 కి.మీల లోపు బస్సు సర్వీసుల కోసం బస్టాపుల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడే తీసుకొని బస్సెక్కాలి. కండక్లర్లు ఇక బస్సుల్లో టికెట్లు అమ్మకుండా చర్చలు తీసుకుంటున్నారు.

ఇక గ్రామాలకు ప్రయాణించే పల్లె వెలుగు విషయంలో బుకింగ్ ఏజెంట్లను తెస్తున్నారు. వారినుంచే టికెట్లను తీసుకోవాలి. సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు ఉండరు. టికెట్ తీసుకునే వారు ఎక్కాలి. కొన్ని స్టాపుల్లో టికెట్లు తీసుకోవాలి. ఈ మేరకు ఈ మార్గదర్శకాలపై ఏర్పాట్లు చేయాలని అన్ని డిపోల మేనేజర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18 నుంచి ఆర్టీసీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.