Begin typing your search above and press return to search.
నిన్న కరోనా ...నేడు ఆర్టీయే .. ప్రైవేట్ ట్రావెల్స్ పై ఉక్కుపాదం!
By: Tupaki Desk | 12 Jan 2021 11:45 AM ISTప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగర శివార్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీయే అధికారులు దృష్టిసారించారు. ఒక పక్క సంక్రాంతి సీజన్ కావడంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు. ఇక వారికి చెక్ పెట్టడం కోసం రంగంలోకి దిగింది ఆర్టియే.
నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఈ ఉదయం హైదరాబాద్ శివార్లలో పలు చోట్లు వస్తున్న ప్రతి బస్సును తనిఖీ చేశారు. బెంగళూరు, తిరుపతి, కడప నుంచి వచ్చే బస్సులను శంషాబాద్ వద్ద, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను ఔటర్ రింగ్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇంతవరకూ ఐదు బస్సులపై కేసులు నమోదు కాగా, దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బెంగళూరు నుండి వస్తున్న ప్రతి బస్సును ఆపి డాక్యుమెంట్లను చెక్ చేస్తున్నారు. మొన్నటి వరకు కరోనా దెబ్బకు కుదేలయిన ప్రైవేటు బస్సుల నిర్వాహకులు, ఇప్పుడు సంక్రాంతికి అయినా కొంత కోలుకుంటామని భావిస్తే ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తూ కేసులు పెట్టడం ప్రైవేటు బస్సుల నిర్వాహకులకు శాపంగా మారింది. కరోనా కారణంగా గతంతో పోలిస్తే ఈ సారి ప్రైవేట్ ట్రావెల్స్ కు సంక్రాంతి పండుగకు పెద్దగా గిరాకీ లేదనే చెప్పాలి . ప్రైవేట్ ట్రావెల్స్ ఈ సారి ఇతర ప్రాంతాలకు నడిపిన బస్సు సర్వీసులు కూడా పెద్దగా లేవనే చెప్పాలి . కరోనా దెబ్బ ట్రావెల్స్ మీద దారుణంగా పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీయే అధికారులు కూడా షాక్ ఇస్తున్నారు.