Begin typing your search above and press return to search.

జస్ట్ 60 సెకన్లలో ఆవిరైంది.. రూ.4.42 లక్షల కోట్లు

By:  Tupaki Desk   |   6 March 2020 6:13 AM GMT
జస్ట్ 60 సెకన్లలో ఆవిరైంది.. రూ.4.42 లక్షల కోట్లు
X
ఓవైపు కరోనా.. మరోవైపు దేశీయంగా నెలకొన్న పరిణామాలు. మొత్తంగా భారత స్టాక్ మార్కెట్ ను భారీ షాకింగ్ తో పాటు.. షేర్లలో మదుపు చేసిన మదుపరులకు మార్కెట్ ఊచకోత అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు (శుక్రవారం) మార్కెట్ ప్రారంభం కావటంతోనే భారీ కుదుపునకు లోనయ్యాయి సెన్సెక్స్ తో పాటు.. నిఫ్టీ సూచికలు.

కేవలం నిమిషం.. అంటే అరవై సెకన్ల వ్యవధిలో షేర్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ.4.42లక్షల కోట్ల సొమ్ము ఆవిరైంది. దీంతో.. మదుపుదారులు విలవిలలాడిపోయారు. మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ 1459 పాయింట్లు నష్టపోతే.. నిఫ్టీ 374 పాయింట్లు నష్టపోయింది. దీంతో.. మార్కెట్లో భారీ రక్తపాతం చోటు చేసుకున్నట్లైంది.
కరోనా భయంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీ కదుపునకు లోనవుతున్న వేళ.. ఆ ప్రభావం భారత్ మీదా పడింది. దీనికి తోడు యస్ బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాలు బ్యాకింగ్ సెక్టార్ మీద మదుపరులుకు ఉన్న సెంటిమెంట్ ను దెబ్బ తీయటంతో.. ఆ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. వారాంతంలోనే ఇలా ఉంటే.. శని.. ఆదివారాల్లో చోటు చేసుకునే పరిణామాలు సోమవారం మార్కెట్ ను మరెలా ఉంచుతాయన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారుస్తోంది.
గురువారం ట్రేడింగ్ ముగింపు తో పోలిస్తే.. శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయానికి సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోతే.. నిఫ్టీ 366 పాయింట్లను కోల్పోయి.. మార్కెట్ ను తీవ్ర నష్టాల బాటలో పయనిస్తున్నాయి. శుక్రవారం ఆరంభంలో నష్టపోయిన 1400 పాయింట్లతో పోలిస్తే.. కొద్ది గంటల్లో 200 పాయింట్లు రికవరీ అయ్యాయని చెప్పాలి. ఇటీవల కాలంలో భారీ పతనాల్లో ఈ రోజు ఒకటిగా నిలుస్తుందని చెప్పక తప్పదు.

బేర్ రంకెలతో మార్కెట్ వణికిపోతోంది. ముఖ్యంగా బ్యాకింగ్ షేర్లు భారీ ఎత్తున విలువను కోల్పోతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ ఏకంగా 11 శాతం నష్టపోతే.. ఎస్ బీఐ 8 శాతం.. ఐసీఐసీఐ.. యాక్సెస్ బ్యాంకులు నాలుగు శాతానికి పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం పడిపోవటంతో.. సూచీలు భారీగా పతనం కావటానికి కారణంగా మారాయి.