Begin typing your search above and press return to search.

గుజరాత్‌ కంపెనీ వద్ద రూ.వెయ్యి కోట్ల బ్లాక్ మనీ..

By:  Tupaki Desk   |   3 Aug 2022 7:51 AM GMT
గుజరాత్‌ కంపెనీ వద్ద రూ.వెయ్యి కోట్ల బ్లాక్ మనీ..
X
బ్లాక్ మ‌నీ.. ఈ పేరు చెప్ప‌గానే ఠ‌క్కున 2014 ఎన్నిక‌లే గుర్తుకు వ‌స్తాయి. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉ న్న న‌రేంద్ర మోడీ.. విదేశాల్లో ఉన్న బ్లాక్ మ‌నీని వెన‌క్కి ర‌ప్పిస్తామ‌ని.. దేశంలోని పేద‌ల‌కు పంచుతామ‌ని హామీ ఇచ్చారు.

అయితే.. ఇప్ప‌టికీ ఈవిష‌యం సందిగ్ధంగానే ఉంది. అయితే.. ఇప్పుడు అదే న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో బ్లాక్ మ‌నీ.. కేసులు, డ‌బ్బుల గుట్ట‌లు బ‌య‌ట ప‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది.

గుజరాత్‌కు చెందిన ఒక వ్యాపార దిగ్గజంపై ఆదాయ పన్ను(ఐటీ) విభాగం జరిపిన సోదాల్లో రూ.1,000 కోట్లకు పైగా 'లెక్కల్లో చూపించని' ఆదాయం కనిపించిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఇందులో రూ.24 కోట్ల నగదుతో పాటు రూ.20 కోట్ల విలువైన ఆభరణాలు, బులియన్‌ తదితరాలను జప్తు చేసినట్లు తెలిపింది.

జులై 20న హైదరాబాద్‌తో పాటు ఖేడా, అహ్మదాబాద్‌, ముంబయి, కోల్‌కతాలలోని కంపెనీకి చెందిన 58 ప్రాంగణాల్లో సోదాలు జరిగినట్లు తెలిపింది. ఈ 'ప్రముఖ' కంపెనీ జౌళి, రసాయనాలు, ప్యాకేజింగ్‌, స్థిరాస్తి, విద్యా రంగాల్లో వ్యాపారాలున్నాయని సీబీడీటీ తెలిపింది.

ఐటీ దాడుల సమయంలో పత్రాలు, డిజిటల్‌ డేటాను జప్తు చేశారు. మ‌నీ లాండ‌రింగ్‌, బోగస్‌ కొనుగోళ్ల బుకింగ్‌, స్థిరాస్తి లావాదేవీలకు నగదు రశీదులు ఇవ్వడం ద్వారా 'పెద్ద స్థాయి'లో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సీబీడీటీ పేర్కొంది. 'కోల్‌కతాకు చెందిన డొల్ల కంపెనీల నుంచి లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంద'ని వివరించింది.

తన కంపెనీలకు చెందిన షేర్ల ధరలను ఆపరేటర్ల ద్వారా హెచ్చుతగ్గులకు గురి చేసి మ‌రీ లాభాలను పొందిందనీ తెలిపింది. మొత్తంగా చూస్తే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇలాకాలోనే ఇలా వెయ్యి కోట్ల రూపాయ‌ల బ్లాక్ మ‌నీ బాగోతాలు వెలుగు చూడ‌డం పెద్ద ఎత్తున దేశంలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రి దీనిపై బీజేపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి.