Begin typing your search above and press return to search.

రాజ్యాంగం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఘాటు వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   25 Aug 2021 4:35 AM GMT
రాజ్యాంగం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఘాటు వ్యాఖ్యలు
X
తెలంగాణ గురుకులాల దశమార్చిన ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీఎస్పీలో చేరి రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణలో బహుజన రాజ్యం తెస్తానంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో రాబోయేది బహుజన రాజ్యమేనని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలదే రాజ్యాధికారమని ప్రవీణ్ అన్నారు. ఇప్పటివరకూ పాలకులు దోచుకున్న వేల కోట్ల డబ్బులను గల్లా పట్టి తీసుకొస్తామని.. వాటిని వైద్యం, విద్య, ఉపాధి కల్పనకు ఖర్చు చేస్తామని ఆయన అన్నారు.

ప్రగతి భవన్ ను బహుజన భవన్ గా మారుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు కావాల్సింది గులాబీ తెలంగాణ కాదని.. నీలితెలంగాణ అని అన్నారు. ఏనుగు గుర్తును గెలిపించాలని బహుజన దేవతలను పూజించాలన్నారు.

అంబేద్కర్, కాన్షీరాం వారుసలమని.. మడమ తిప్పడం.. మాట తప్పడం తమకు తెలియదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘రాజ్యంగాన్ని రాసిందే మాతాత అంబేద్కర్ అని.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలే భవిష్యత్ లో పాలకులు అవుతారని’ ప్రవీణ్ కుమార్ అన్నారు.

హన్మకొండ హంటర్ రోడ్డులో నిర్వహించిన పార్టీ సమీక్షలో ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ పాల్గొని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులను ఈ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఒకానొక ఎమ్మెల్యే దళితులకు చదువురాదని అవమానించారని ప్రవీణ్ అన్నారు. కానీ మా బిడ్డలు ఇంజినీర్లు, లాయర్లు, డాక్టర్లుగా ఉన్నారని.. వారే పాలకులు కాబోతున్నారని ఆయన అన్నారు.