Begin typing your search above and press return to search.
రూ.9వేల కోట్ల డ్రగ్స్ సీజ్ .. విజయవాడ పోలీసుల ఆరా !
By: Tupaki Desk | 20 Sept 2021 12:43 PM ISTదేశంలో భారీ లెవెల్ లో జరుగుతున్న డ్రగ్స్ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న మత్తుపదార్థాలపై దృష్టిసారించిన అధికారులు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహించి, డ్రగ్స్ ముఠా ఆటలు కట్టిస్తున్నారు. తాజాగా, గుజరాత్ లో రూ.9,000 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.9,000 కోట్ల విలువైన హెరాయిన్ ఉన్న 2 కంటెయినర్లను సెప్టెంబరు 15న జప్తుచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఆఫ్ఘన్ లోని కాందహార్ కేంద్రంగా పనిచేసే హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ రూపంలో వచ్చిన ఈ సరకు విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళుతున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు. సంస్థ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, ఇప్పటివరకు ఎన్ని కన్ సైన్ మెంట్లు వచ్చాయి, ఏయే దేశాల నుంచి వచ్చాయి, తదితర వివరాలను కూపీ లాగుతున్నారు. అషీ ట్రేడింగ్ మూలాలు కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకూ విస్తరించినట్లు తేలింది. కేవలం కాగితాల్లో మాత్రమే ఈ కంపెనీని నడిపిస్తున్నట్లు వెల్లడైంది. విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వారి వీధి చిరునామాతో ఆషీ ట్రేడింగ్ కంపెనీ గతేడాది ఆగస్టు 18న రిజిస్టర్ అయింది.
దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు అనే వ్యక్తి పేరుతో దీనిని ప్రారంభించి.. బియ్యం, పండ్లు, కూరగాయల టోకు వ్యాపారం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబరు ఎం సుధాకర్ అనే వ్యక్తి పేరుతో ఉండగా.. ప్రస్తుతం అది స్విచ్ఛాఫ్ వస్తోంది. అదే నంబర్ తో ఉన్న వాట్సప్ ప్రొఫైల్ పరిశీలించగా, చెన్నై కేంద్రంగా ‘ఆషీ సోలార్ సిస్టమ్’ అనే మరో కంపెనీని కూడా సుధాకర్ నెలకొల్పినట్లు వెల్లడయ్యింది. దానికి సంబంధించిన బ్రోచర్ ను తన ఫోన్ నంబర్, పేరుతో సహా ఆయన వాట్సప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకున్నారు.
కాకినాడకు చెందిన సుధాకర్ ఎనిమిదేళ్లుగా చెన్నై శివారు పోరూరులోని కోలపాకంలో ఓ అపార్ట్ మెంట్ లో కుటుంబంతో సహా ఉంటున్నాడు. ఈ క్రమంలో పక్కింట్లో నివాసం ఉండే ఇంజినీరింగ్ చదివిన యువకుడిని సంప్రదించాడు. సోలారా విద్యుత్ పరికరాలకు సంబంధించిన వ్యాపారం చేయాలకుంటున్నానని, తనకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనందున సహకరించాలని కోరాడు. అనంతరం ఆ యువకుడి ఫోన్ నంబర్‌ను కంపెనీ కాంటాక్ట్స్‌లో పొందుపరిచాడు. కానీ ఆ కంపెనీ ద్వారా ఎలాంటి వ్యాపారమూ చేయలేదు. ముంద్రా ఓడరేవులో గత బుధవారం డీఆర్‌ఐ అధికారులు హెరాయిన్‌తో కూడిన కంటైనర్లను పట్టుకున్నారు. అవి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఉన్నట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ సంస్థ ఈ దిగుమతికి ఆర్డర్ పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. గత ఐదురోజులుగా మాదక ద్రవ్యాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. టాల్కమ్ పౌడర్ పేరిట ఈ డ్రగ్స్‌ను మన దేశానికి దిగుమతి చేసుకున్నట్టు తేలింది. పైకి చూస్తే టాల్కమ్ పౌడర్ లాగే ఉన్నప్పటికీ దాన్ని పరీక్షిస్తే హెరాయిన్ అని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. విజయవాడకు చెందిన ట్రేడింగ్ సంస్థ ఆ కన్ సైన్ మెంట్ ను టాల్కమ్ పౌడర్ గానే పేర్కొంది.