Begin typing your search above and press return to search.
యూట్యూబ్ చూసి బ్యాంక్ లో రూ.77 లక్షల చోరీ !
By: Tupaki Desk | 30 Nov 2020 7:00 AM ISTయూట్యూబ్ ...ప్రస్తుత రోజుల్లో దీని గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన పనిలేదు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి యూట్యూబ్ తో కాలక్షేపం చేసేవాళ్లు లక్షలమంది ఉంటారు. ఏ వంట చేయాలన్నా, ఏదైనా సినిమా చూడాలన్న, స్టడీ మెటీరియల్ కావాలన్నా, తెలియని విషయం ఏదైనా సరే తెలుసుకోవాలంటే, యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది.అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ చూసి దోపిడీలు, దొంగతనాలు కూడా చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ లో చూసి బ్యాంకు కాజేశారు కానీ, పోలీసులకి పట్టుబడ్డారు. సంచలనం సృష్టించిన దాచేపల్లి పరిధిలోని తంగెడలోని ఎస్ బీఐ లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించి రూ.77 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు కి సంబంధించిన వివరాలని పోలీసులు వివరిస్తూ ... మిర్యాలగూడలోని గాంధీనగర్‌కు చెందిన కేదారి ప్రసాద్, అతడికి బాబాయి వరుసయ్యే వినయ్ రాములు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాలయ్యారు. యూటూబ్ చూసి బ్యాంక్ చోరీ చేయాలని నిర్ణయించారు. నిందితుల్లో ఒకరైన కేదారి ప్రసాద్ ఇంటర్ వరకు చదివాడు. ఈ క్రమంలో బ్యాంక్ లో ఎలా చోరీ చేయాలో యూటూబ్ చూసి నేర్చుకున్నారు. చివరకు దాచేపల్లి పరిధిలోని తంగెడలో గల ఎస్ బీఐ ను చోరీ కోసం ఎంచుకున్నారు. ఈ బ్యాంక్ మెయిన్ రోడ్డుకు కొంచెం దూరంగా ఉండటం, చుట్టుపక్కల ఇళ్ళు లేకుండా ఖాళీ ప్రదేశాలు ఉండటం, భవనం నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం వంటి అంశాలు చోరీకి కలిసి వస్తాయని భావించి ఈ బ్యాంక్ ను ఎంచుకున్నారు.
ఇద్దరూ కలిసి బ్యాంకు వద్ద రెక్కీ నిర్వహించారు. ఈనెల 21న బ్యాంకులోని రూ.77 లక్షల నగదు చోరీ చేశారు. సీసీ కెమెరాలు తొలగించి, గ్యాస్ కట్టర్ ఉపయోగించి లాకర్ తెరవడంతోపాటు పోలీసు జాగిలాలు వాసన పసిగట్టకుండా కారంపొడి చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఘటన జరిగిన తీరును బట్టి తొలుత నేరాలు చేయడంలో బాగా ఆరితేరిన వారు చేసిన పనిగా భావించామన్నారు. లోతుగా దర్యాప్తు చేయగా ఇద్దరూ కొత్త నేరస్థుల పని అని తేలిందన్నారు పోలీసులు. సీసీఎస్ ఏఎస్పీ మూర్తి, డీఎస్పీ రవికృష్ణకుమార్, గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్‌లతోపాటు ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాల ప్రకారం దర్యాప్తు చేయగా ప్రసాద్, వినయ్‌రాములు యూట్యూబ్ చూసి చోరీ చేసినట్లు నిర్ధారణయ్యిందన్నారు. నిందితులు ఒక్కసారిగా రూ.77 లక్షల నోట్ల కట్టలు చూసేసరికి భయపడ్డారు. వాటిని ఎక్కడ దాచాలో అర్థం కాక ఇంటిలో కాకుండా చెట్లపొదల్లో కొంత, మరో చోట మరికొంత దాచారు. బ్యాంక్ చోరీ కేసును ఛేదించే విషయంలో సీసీఎస్ అదనపు ఎస్పీ ఎన్‌వీఎస్ మూర్తి, గురజాల డీఎస్పీ జయరామ్ ప్రసాద్, సీసీఎస్ డీఎస్పీ రవికృష్ణకుమార్, గురజాల రూరల్ సీఐ ఉమేష్, దాచేపల్లి ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్‌బీ సీఐ బాలమురళీకృష్ణల ఆధ్వర్యంలో 8 బృందాలు సమర్థవంతంగా పని చేశాయని రూరల్ ఎస్పీ వారిపై ప్రశంసలు కురిపించారు.