Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు కొత్త రూ.500 నోటు వచ్చేసింది

By:  Tupaki Desk   |   22 Nov 2016 11:25 AM IST
హైదరాబాద్ కు కొత్త రూ.500 నోటు వచ్చేసింది
X
ఎప్పుడో వారం క్రితమే కొత్త రూ.500 నోటు వచ్చేసిందని ఆర్ బీఐ ప్రకటించింది. కొత్త రూ.500 నోటును చూపిస్తూ మీడియాకు ఫోటోలు దిగినోళ్లూ ఉన్నారు. అదే అదనుగా.. విశాఖపట్నంలో కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయంటూ భారీ ఎత్తున ప్రచారం జరగటమే కాదు.. కొన్ని తెలుగు ఛానళ్లు అయితే.. ఏకంగా బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తలు వండి వడ్డించేశాయి. హైదరాబాద్ కు రాకుండా.. విశాఖపట్నానికి కొత్త రూ.500 నోట్లు ఎలా వస్తాయి? అన్న సందేహం కొందరు బ్యాంకు అధికారుల్ని పట్టి పీడించింది. అదే సమయంలో కొందరు మీడియా ప్రతినిధులకు కూడా అదే సందేహం వచ్చింది.

వెంటనే ఫోన్ల మీదకు వెళ్లిపోయి.. అదే పనిగా జిల్లా యంత్రాంగాన్ని కదిలించి.. లీడ్ బ్యాంక్ ఉన్నతాధికారుల్ని సంప్రదిస్తే. అదంతా ఫేక్ న్యూస్ అండి. నాకు తెలీకుండానే.. విశాఖపట్నంలో కొత్త రూ.500 నోటు ఎలా వస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. కొన్ని ఛానళ్ల వార్తల్ని ఆయనకు చూపిస్తే.. ఆయన సైతం విస్తుపోయే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. కొత్త రూ.500 నోట్లను విడుదల చేసినట్లు ప్రకటించినా.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ నోట్లు రాలేదు. అలాంటిది హైదరాబాద్ లో నిన్న కొత్త రూ.500 నోటు వచ్చింది. బ్యాంకులకు రాకుండా.. కొత్త నోటు బయటకు ఎలా వచ్చిందా? అన్న డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఈ మధ్యన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు అక్కడ కొత్త రూ.500 నోట్లు చేతికి అందాయి (కొన్ని రాష్ట్రాల్లో కొత్త రూ.500 నోట్లు చెలామణీలోకి వచ్చేశాయి) తాజాగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఒక టిఫిన్ సెంటర్ కు వెళ్లి టోకెన్ తీసుకోవటానికి రూ.500 నోట్లను ఇచ్చారు. దీంతో.. తొలిసారి హైదరాబాద్ కు కొత్త రూ.500 నోట్లు వచ్చినట్లైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/