Begin typing your search above and press return to search.

మూడున్నర కోట్లు ఉన్నాయి.. దివ్యాంగులను ఆదుకుంటాం: హైకోర్టులో తెలంగాణ

By:  Tupaki Desk   |   25 Jun 2020 10:50 AM IST
మూడున్నర కోట్లు ఉన్నాయి.. దివ్యాంగులను  ఆదుకుంటాం: హైకోర్టులో తెలంగాణ
X
లాక్ డౌన్ నేపథ్యంలో దివ్యాంగులకు సహాయం చెయాలని.. వారికి ప్రభుత్వం అండగా ఉండేలా ఆదేశించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటీషన్ పై బుధవారం విచారణ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా.. దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులకు , ఇతర అత్యవసరాల కోసం ప్రస్తుతం రూ.3.5 కోట్ల నిధులు అందుబాటు లో ఉన్నాయని మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య హైకోర్టుకు విన్నవించారు.

ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య ఈ విచారణకు హాజరయ్యారు.

దివ్యాంగుల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె హైకోర్టు కు వివరణ ఇచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.3,016 పింఛను అందజేస్తున్నదని, లాక్‌డౌన్‌లో రూ.1,500 ఆర్థిక సాయం, 12 కిలోల చొప్పున బియ్యం అందజేశామని వివరించారు. ఔషధాలు అందజేయడానికి ప్రతి జిల్లాకు రూ.లక్ష నిధులు అందుబాటు లో ఉంచామని ధర్మాసనానికి తెలిపారు. ఇది అనంతరం విచారణ వాయిదా పడింది.