Begin typing your search above and press return to search.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే

By:  Tupaki Desk   |   13 Feb 2019 6:06 PM IST
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
X
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. చెప్పుకోవడానికి బాగా ఉంటుంది.. రియల్‌ లైఫ్‌ లో మాత్రం అన్నదమ్ములు కలిసి ఉంటారని, బంధాలు బంధుత్వాలు అంటూ సినిమా డైలాగులు చెప్పుకుంటారని అనుకుంటాం కానీ.. అలాంటివేం ఉండవు. డబ్బుల విషయంలో పేదవాడు అయినా ధనికుడైన ఒకేలా ఉంటారని నిరూపించారు ముకేష్‌ అంబానీ.

ధీరూభాయ్‌ అంబానీ అస్తమయం తర్వాత అన్నదమ్ములు ముకేష్‌, అనిల్ ఇద్దరూ వ్యాపారాలు పంచుకుని విడిపోయారు. ముకేష్‌ తను కష్టాన్ని నమ్ముకుని.. ఇండియాలో నెంబర్‌ వన్‌ ధనవంతుడు అయ్యాడు. అదే టైమ్‌ లో అనిల్‌.. లేనిపోని ఎచ్చులకు పోయి ఉన్నదంతా పొగొట్టుకుని అప్పులపాలై పోయాడు. అప్పులు తీర్చేందుకు ఆర్‌ కామ్‌ ని అన్నకే అమ్మకానికి పెట్టాడు. అన్నకూడా కొంటానని మాట ఇచ్చేసరికి.. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అంటూ పాటు కూడా వేసుకున్నాడు. తీరా ఇప్పుడు ఆర్‌ కామ్‌ కొనే టైమ్‌ వచ్చేసరికి తాను కోనడం లేదంటూ బాంబ్‌ పేల్చాడు ముకేష్‌ అంబానీ.

స్వీడన్‌ టెలికాం కంపెనీ ఎరిక్సన్‌ కు అనిల్‌ అంబానీ రూ.550 కోట్లు చెల్లించాలి. గడువు సమయానికి చెల్లించలేకపోయేసరికి కోర్టు థిక్కరణ కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో.. జరిగిన విషయాన్ని అనిల్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అన్నయ్య ఆదుకుంటాడని భావిస్తే.. ఇలా హ్యాండ్‌ ఇస్తాడని ఊహించలేకపోయాడు అనిల్‌. అంతేమరి.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.