Begin typing your search above and press return to search.

రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు..50 ఏళ్లపాటు వడ్డీలేని రుణం : కేంద్రం !

By:  Tupaki Desk   |   1 May 2021 8:30 AM GMT
రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు..50 ఏళ్లపాటు వడ్డీలేని రుణం : కేంద్రం !
X
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ధిక మంత్రిత్వ‌శాఖ‌, మూల‌ధ‌న ప్రాజెక్టుల‌పై వ్య‌యం చేసేందుకు 50 సంవత్స‌రాల రుణంగా వ‌డ్డీ లేని రుణం కింద అద‌నంగా 15,000 కోట్ల రూపాయ‌లు అద‌నపు మొత్తాన్ని స‌మకూర్చాల‌ని నిర్ణయం తీసుకుంది. వ్య‌య‌విభాగం ఇందుకు సంబంధించి , మూల‌ధ‌న వ్య‌యానికి సంబంధించి రాష్ట్రాల‌కు ఆర్ధిక స‌హాయం పేరుతో వ్య‌య విభాగం 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రానికి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఈ పథకం కింద వడ్డీ లేకుండా 50 సంవత్సరాల రుణం రూపంలో ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. ఇందుకోసం 2020–21 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంట్లో రూ.11,830 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశారు.

ఈ ప‌థ‌కం కింద‌, వ‌డ్డీ లేకుండా 50 సంవ‌త్స‌రాల రుణం రూపంలో ఆర్ధిక స‌హాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అందిస్తారు. ఈ ప‌థ‌కం కింద 2020-21 సంవ‌త్స‌రానికి ఈ ప‌థ‌కానికి 12,000 కోట్ల రూపాయ‌లు కేటాయించారు. ఇందులో 11,830 కోట్ల రూపాయ‌లు రాష్ట్రాల‌కు విడుద‌ల చేశారు. కరోనా వైరస్ మ‌హ‌మ్మారి సంవ‌త్స‌రంలో రాష్ట్ర‌స్థాయిలో మూల‌ధ‌న వ్య‌యానికి ఇది స‌హాయ‌ప‌డింది. మొదటి విభాగం ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాలకు సంబంధించినది. ఈ విభాగానికి రూ. 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. రెండో విభాగంలోని రాష్ట్రాల కోసం రూ. 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం అవార్డు మేరకు కేంద్రపన్నులలో వాటి దామాషా ప్రకారం కేటాయిస్తారు. మూడో విభాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్, మౌలిక సదుపాయాల ఆస్తుల రీసైక్లింగ్, పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ విభాగం కింద ఈ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు అసెట్‌ మానిటైజేషన్, లిస్టింగ్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా పొందుతాయి.

2021-22 సంవ‌త్స‌రానికి రాష్ట్రాల‌కు మూల‌ధ‌న వ్య‌యానికి ప్ర‌త్యేక స‌హాయ ప‌థ‌కం కింద మూడు భాగాలు ఉన్నాయి. అవేంటంటే ..

పార్ట్ః-1 : ఈ విభాగంలోని ప‌థ‌కం ఈశాన్య‌, కొండ‌ప్రాంత రాష్ట్రాల‌కు సంబంధించిన‌ది. ఈ విభాగానికి రూ 2,600 కోట్ల రూపాయ‌లు కేటాయించారు. ఇందులో అస్సాం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాలు ఒక్కొక్క‌టి 400 కోట్ల రూపాయ‌లు పొందుతాయి. ఈ గ్రూపులోని మిగిలిన రాష్ట్రాల‌కు ఒక్కొక్క‌దానికి 200 కోట్ల రూపాయ‌లు కేటాయించారు.

పార్ట్ 2: ఈ విభాగం కింద పార్ట్‌-1 లో చేర‌ని ఇత‌ర రాష్ట్రాలు వ‌స్తాయి. ఈ విభాగంలోని రాష్ట్రాల కోసం రూ 7,400 కోట్ల రూపాయ‌లు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15 వ ఆర్థిక సంఘం అవార్డు మేర‌కు కేంద్ర‌ప‌న్నుల‌లో వాటి వాటా దామాషా ప్ర‌కారం కేటాయించ‌డం జ‌రిగింది.

పార్ట్ 3: ఈ విభాగం కింద రాష్ట్రాల‌కు మానిటైజేష‌న్‌, మౌలిక‌స‌దుపాయాల ఆస్థుల రీసైక్లింగ్‌, ప‌బ్లిక్ సెక్ట‌ర్ ఎంట‌ర్ ప్రైజెస్ ల నుంచి పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు ప్రోత్సాహ‌కం అంద‌జేస్తారు. ఈ విభాగం కింద ఈ ప‌థ‌కానికి రూ 5000 కోట్ల రూపాయ‌లు కేటాయించారు. ఈ విభాగం కింద‌, రాష్ట్రాలు అసెట్ మానిటైజేష‌న్‌, లిస్టింగ్‌, పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా స‌మ‌కూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వ‌ర‌కు మొత్తాన్ని 50 సంవ‌త్స‌రాల పాటు వ‌డ్డీ లేని రుణంగా పొందుతాయి.