Begin typing your search above and press return to search.

రూ.140 కోట్ల జరిమానాల వసూల్..

By:  Tupaki Desk   |   17 March 2022 7:28 AM GMT
రూ.140 కోట్ల జరిమానాల వసూల్..
X
బండిపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టకపోయినా.. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినా.. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికినా.. కరోనా నిబంధనలు పాటించకపోయినా.. ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి ప్రభుత్వం రకరకాల ఫైన్లను విధించింది. అయితే కొందరు తమకు విధించిన జరిమానాలు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా, చాలా మంది ఛలాన్లు పెండింగులో ఉన్నాయి.

దీంతో ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ట్రాపిక్ పోలీస్ విభాగం కొత్త ఆఫర్ ను ప్రకటించింది. వాహనదారులు తమకున్న చలాన్లను క్లియరెన్స్ చేసుకోవడానికి డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ప్రజలు చలాన్లు కట్టేందుకు క్యూ కట్టారు. మీసేవ సెంటర్లు, మొబైల్స్ ఇలా ఎలా వీలైతే అలా తమ చలాన్లను క్లియర్ చేసుకున్నారు.

తాజాగా బుధవారం వరకు ఈ క్లియరెన్స్ ద్వారా వచ్చిన మొత్తం రూ.140 కోట్లు. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరు రూ.1.3 ోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ కావడంతో ఈ మొత్తం వసూలైనట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపింది. నిమిషానికి వెయ్యి చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారని, మొదటి రోజే రూ.5.5 కోట్లు వచ్చాయని అంటున్నారు. కాగా ఈ ఆఫర్ ఈనెల 31 వరకే గడువు ఉండడంతో ఇంకా చాలా మంది వాహనదారులు తమ వాహనాలపై ఉన్న జరిమానాలను కట్టేస్తున్నారు.

ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న చలాన్లను రాబట్టడానికి పోలీసులు ఎన్ని తనిఖీలు నిర్వహించిన వసూలు కాలేదు. కొందరు వాహనాలను జప్తు చేస్తున్నా.. తమ వాహనాలు విడిచిపెట్టారు గానీ.. చలాన్లను చెల్లించలేదు. దీంతో పోలీస్ శాఖ కొత్త ఆఫర్లను ప్రకటించడంతో వినియోగదారులు చలాన్లను కట్టేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించారు.

నోమాస్క్ జరిమానాకు 90 శాతంత, రెండు, మూడు వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ డ్రైవర్లకు 70 శాతం, లైట్, హెవీ వెహికిల్ వాహనాలకు 50 శాతం మాఫీ, తోపుడు బండ్లకు 75 శాతం మాఫీ ప్రకటించారు.

దీంతో తమ వాహనాలపై జరిమానాలు ఉన్నవారు మీసేవ, ఆన్లైన్, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద చెల్లిపులు చేశారు. ఇంకా ఎవరైనా ఛలాన్లను చెల్లించిన వారుంటూ https:/echallan.tspolice.gov.in లింక్ ద్వారా కూడా కట్టవచ్చిన పోలీసులు తెలుపుతున్నారు. ఇక ఇప్పటి వరకు రూ.140 కోట్లు వసూలు కాగా.. గడువు పూర్తయ్యేలోపు ఎంత వసూలవుతుందో చూడాలని అంటున్నారు.