Begin typing your search above and press return to search.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఇక తీరినట్లే

By:  Tupaki Desk   |   4 Aug 2016 4:24 AM GMT
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఇక తీరినట్లే
X
కేంద్రమంత్రి వర్గం ఒక కీలక అంశానికి సంబం​ధించిన కఠిన నిర్ణయాన్ని వెల్లడించింది. పూటుగా తాగేసి.. బండి ఎక్కేసి వాహనాన్ని నడిపే మందుబాబులకు భారీ షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నేరానికి పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల​ని డిసైడ్ కావటమే కాదు.. తాగి వాహనాన్ని నడిపే వారిపై భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని అదుపులోకి తీసుకోవటం.. వారికి జైలుశిక్ష అమలు చేయటం లాంటి కఠిన చర్యల్ని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. తాగి వాహనాన్ని నడిపితే.. నడిపినోళ్లకు రూ.10 వేలు జరిమానా విధించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మంత్రివర్గం ఆమోదించిన ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా అమలు కానుంది.

ఈ భారీ జరిమానా నిర్ణయం బాగానే ఉన్నా.. ఇది అవినీతిని మరింత పెంచి పోషించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. భారీ జరిమానాను చట్టంలో చేర్చటం ద్వారా.. అంత మొత్తాన్ని ఫైన్ రూపంలో చెల్లించే కన్నా.. ఎంతొకొంత అమ్యామ్యా ఇచ్చేసి సర్దుబాటు చేసుకునే వైనానికి తెర తీసే అవకాశమే ఎక్కువ ఉంది. ఒకవేళ ఈ అనుమానమే నిజమైన పక్షంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడటమే కాదు.. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ఛా​న్స్ ఉండదనే చెప్పాలి.

డ్రంక్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు బాధ్యులుగా వ్యవహరించే పోలీసు అధికారుల్ని సైతం ఈ ప్రమాదాలకు బాధ్యుల్ని చేసిన పక్షంలో ఈ నేరాలు కట్టడి చేసే వీలుంది. ఏమైనా కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం సరిగా అమలైన పక్షంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు చేసే వారి దూల తీరిపోవటం ఖాయం.