Begin typing your search above and press return to search.

మార్చి నాటికి రూ.100 నోటు కనపడదట?

By:  Tupaki Desk   |   22 Jan 2021 7:00 PM IST
మార్చి నాటికి రూ.100 నోటు కనపడదట?
X
ప్రధానిగా గద్దెనెక్కినప్పటి నుంచి తనదైన ముద్ర కోసం తపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ అన్నింటిని మార్చేస్తున్నారు. ముఖ్యంగా పాత నోట్లకు మంగళం పలికి కొత్త నోట్లను తెచ్చారు. ఇప్పటికే పాత రూ.500, పాత రూ.1000 నోటును బ్యాన్ చేశారు. ఇప్పుడు పాత రూ.100 నోటుపై పడ్డారు.

పాత వంద సిరీస్ నోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. కొత్త సిరీస్ నోట్లను సర్క్యూలేషన్ చేయాలని అనుకుంటోంది. మంగళూరులోని దక్షిణ కన్నడ జిల్లా పంచాయితీ హాల్ లో జిల్లా స్థాయి బ్యాంకింగ్ సెక్యూరిటీ కమిటీ అండ్ క్యాష్ మేనేజ్ మెంట్ కమిటీ సబేలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్ మాట్లాడారు. పాత సిరీస్ లో ఉన్న వంద రూపాయలు నోట్లని మార్చి నాటికి పూర్తిగా తీసుకోనున్నామన్నారు.

ఇప్పటికే ఆరేళ్లుగా పాత రూ.100 నోట్లను ముద్రించడం లేదని మహేష్ తెలిపారు. గతంలో ప్రింట్ చేసిన ఈ నోట్లను అన్నింటిని తీసుకుంటామని తెలిపారు.ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని.. కొత్త నోట్లను మాత్రమే ఉంచాలనే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఇక ఆర్బీఐ ఇప్పటికే ప్రజల్లో చెల్లదని ముద్రపడి రూ.10 కాయిన్స్ ను చెలామణి చేయమని బ్యాంకులని సూచించింది. ఇప్పటికే రూ.10 నాణేలను బయట జనాలు ఎవరూ తీసుకోవడం లేదు. వాటిని గుర్తించి చెల్లుతాయని బ్యాంకులు అవగాహన కల్పించాలని సూచించారు.