Begin typing your search above and press return to search.
విడ్డూరం.. బార్బీ బొమ్మలా మారేందుకు రూ.10లక్షలు!
By: Tupaki Desk | 25 May 2021 8:30 AM GMTపుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఒక్కక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. ఇష్టమైన బొమ్మలు కనుక్కోవాలి అనుకుంటారు కొందరు. మార్కెట్ లో ఉండే అందమైన బొమ్మ తమ ఇంట్లో ఉండాలని ఆశపడతారు. కానీ మనిషే ఏకంగా బొమ్మలా మారాలనుకోవడం విడ్డూరమే కదా. ఓ యువకుడు బార్బీ బొమ్మలా మారాలనుకున్నాడు. అందుకు ఎంతైనా ఖర్చు చేస్తానంటున్నాడు.
ఈశాన్య ఇంగ్లాండ్ లోని హల్ నగరానికి చెందిన 22 ఏళ్ల యువకుడు వింతగా ఆలోచిస్తున్నాడు. బార్బీ కెన్ డాల్ గా మారడానికి ఖర్చుకు వెనకాడని చెబుతున్నాడు. 16 ఏళ్లకే చదువుకు స్వస్తి చెప్పిన ఆ యువకుడు ఓ బోటిక్ లో డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. చిన్న వయసులోని మంచి సంపాదన ఉంది. అయితే ఏం లాభం. ఉన్నదంతా కాస్మోటిక్ ఖర్చులకే ఉపయోగిస్తాడు. అదే తనకు ఆనందాన్ని ఇస్తుందని అంటున్నాడు ఆ యువకుడు.
బార్బీ కెన్ డాల్ గా కనిపించడానికి ఆ యువకుడు ఎంతో ఆరాటపడుతున్నాడు. అందుకే రూ.14వేల డాలర్ల(పది లక్షలు)ను ఖర్చు చేసి మరీ వివిధ శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి పరితపిస్తుంటానని తానే స్వయంగా వెల్లడించాడు. ఇప్పటివరకు లిప్ ఫిల్లర్లు, చీక్ ఇంప్లాంట్లు, బొటాక్, వినీర్లు వంటి వాటితో ముఖంలో పలు మార్పులు చేయించుకున్నాడు. త్వరలో ముక్కును మార్చుకోనున్నట్లు తెలిపాడు.
జిమ్మీ ప్రతివారం తానే హెయిర్ స్టెయిల్ సొంతంగా చేసుకుంటాడు. పెదవులు, చెంపల అందం కోసం వారానికి 4000 డాలర్లు ఖర్చు చేస్తానని చెప్పారు. అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడానికి ఆరాటపడతానని తెలిపాడు. ఫ్యాన్సీ విషయాలపై ఆసక్తి ఎక్కువ అని పేర్కొన్నాడు. అందంగా ఉండడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తానని చెబుతున్నాడు. ఈ వయసులో తనలాంటి జీవన శైలి ఎవరికీ ఉండదని చెబుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ట్రోల్స్ ను తాను సానుకూలంగా పరిగణిస్తానని స్పష్టం చేశాడు.