Begin typing your search above and press return to search.

యోగా గురువుకు షాక్.. కొరొనిల్ పేరు పెట్టినందుకు ఫైన్

By:  Tupaki Desk   |   7 Aug 2020 1:00 PM IST
యోగా గురువుకు షాక్.. కొరొనిల్ పేరు పెట్టినందుకు ఫైన్
X
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. యోగా గురువుగా సుపరిచితుడైన ఆయన.. పతంజలి పేరుతో స్టార్ట్ చేసిన వ్యాఫార సంస్థ ఈ రోజున వేలాది కోట్ల టర్నోవర్ ను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో మల్టీ నేషనల్ బ్రాండ్లకు పతంజటి గట్టి పోటీ ఇవ్వటమే కాదు.. కొన్ని కంపెనీలైతే రాందేవ్ బాబా కంపెనీ దెబ్బకు విలవిలాడిపోయే పరిస్థితి.

ఈ మధ్యన ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నిరోధానికి మందు తెచ్చినట్లుగా ప్రచారం చేయటం.. భారీగా ప్రెస్ మీట్ పెట్టి.. కేంద్రం కన్నెర్రకు గురికావటం తెలిసిందే. తాజాగా మరో విషయంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. పలు వ్యాపారాలు చేసే పతంజలి సంస్థకు.. అయుర్వేద మందుల్ని కూడా ఉత్పత్తి చేసే సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ కొరొనిల్ అనే పేరుతో ఒక ఉత్పత్తిని షురూ చేసింది. దీనిపై భారీగా ఫైర్ వేస్తూ మద్రాస్ హైకోర్టు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొరొనిల్ అనేది 1993 నుంచి తమ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కుగా ఫ్లెయింటిఫ్ అనే సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ ట్రేడ్ మార్కును పతంజలి సంస్థ వాడేస్తుందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. రాందేవ్ బాబా కంపెనీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పేరుతో ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చేటప్పుడు.. ఆ పేరు మీద ఏవైనా ఉత్పత్తులు రిజిష్టర్ అయ్యాయో లేదో అన్నది చూసుకోరా? అని కోర్టు ప్రశ్నించింది.

ఇకపై పతంజలి సంస్థ.. కొరొనిల్ పేరు వాడకూడదని స్పష్టం చేసింది. చేసిన తప్పునకు రూ.10లక్షల జరిమానా కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని సొమ్ము చేసుకోవద్దని హితవు పలికింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులతో వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే ఆలోచనలు చేయకుండా.. ఇలాంటి ఎదురుదెబ్బలు తగిలే ప్లాన్లను రాందేవ్ బాబాు ఎందుకు వేస్తున్నట్లు..?