Begin typing your search above and press return to search.

ఆ న‌టి హ‌త్య‌కు రూ.10 కోట్ల డీల్‌!

By:  Tupaki Desk   |   10 Oct 2022 8:30 AM GMT
ఆ న‌టి హ‌త్య‌కు రూ.10 కోట్ల డీల్‌!
X
బీజేపీ నేత, నటి సోనాల్‌ ఫొగాట్‌ (42) ఈ ఏడాది ఆగ‌స్టులో అనుమానాస్పద పరిస్థితుల్లో గోవాలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమెది హత్యేనని ఆమె కుటుంబీకులు మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. సోనాల్‌ హత్యకు రూ.10 కోట్ల డీల్‌ జరిగిందని ఆమె కుటుంబ స‌భ్యులు తాజాగా ఆరోపించ‌డంతో క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ హత్యకు సంబంధించి కొందరి నుంచి రెండు లేఖలు అందుకున్నట్లు సోనాల్‌ కుటుంబసభ్యుడు అమన్ పూనియా వెల్ల‌డించారు. ఆమెను హత్య చేయ‌డానికి రూ.10 కోట్ల డీల్ కుదిరింద‌ని ఓ లేఖలో పేర్కొన్నారని ఆయ‌న తెలిపారు. అలాగే మ‌రో లేఖ‌లో ప్రముఖ రాజకీయ నేతల పేర్లు ఉన్నాయన్నారు. ఈ లేఖల్లో ముఖ్యమైన సమాచారం ఉండటంతో వీటిపై దర్యాప్తు చేపట్టాలని ఆయన పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

గోవా పర్యటనకు వెళ్లిన సోనాలి ఫోగాట్‌ ఆగస్టు నెలలో అనుమానాస్పద రీతిలో మరణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మొదట గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు వెల్ల‌డైంది.

అంతేకాకుండా సోనాల్ ఫోగ‌ట్ ను ఆమె పీఏ సుధీర్‌ సంగ్వాన్‌, అతడి స్నేహితుడు సుఖ్విందర్‌లు మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నార‌ని సోనాల్ సోద‌రుడు రింకు అప్ప‌ట్లో మీడియాకు తెలిపారు. గత మూడేళ్లుగా ఆమె తింటున్న ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చేవాళ్లని, ఆ త‌ర్వాత ఆమె మ‌త్తులోకి జారుకున్నాక ఆమెపై అత్యాచారం చేసేవార‌ని బాంబు పేల్చారు. మొద‌ట హిస్సార్ లోని ఇంట్లో ఆమెపై అత్యాచారం చేసి.. వీడియో తీశార‌ని వెల్లడించారు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని.. త‌ర‌చూ బ్లాక్‌ మెయిల్‌ చేసి లోబర్చుకున్నారని తెలిపారు. ఎవ‌రికైనా చెబితే ఆమె సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్లిద్దరూ బెదిరించార‌ని సోనాల్ సోద‌రుడు రింకు ఆరోపించారు. ఆమె డబ్బు, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ ఆమెను స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని వాపోయాడు. బ‌య‌ట‌కు తెలిస్తే పరువుపోతుందనే భయంతోనే ఆమె మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు వెల్ల‌డించాడు.

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. సోనాల్‌ సహాయకులైన సుధీర్‌ సంగ్వాన్‌, సుఖ్వీందర్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో సోనాల్‌ మరణంపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు.. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.