Begin typing your search above and press return to search.
దేవుడు ఆజ్ఞాపించాడు.. వందేభారత్ పై రాళ్లు వేయించాడు
By: Tupaki Desk | 22 April 2023 7:59 PM GMTకేంద్రంలోని మోడీ సర్కార్ వందేభారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ ఈ రైలు ప్రారంభించినా మోడీ వచ్చి జెండా ఊపేస్తున్నాడు. ఒక బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ కట్టినంతగా మోడీ దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక మోడీ ఆశించినట్టే ఈ రైళ్లలో అంతా ఎలక్ట్రానిక్ తరహా వ్యవస్థ ఉండడంతో జనాలను ఆకర్షిస్తోంది.
అయితే వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాదాపు ప్రతి రూటులోనూ వందేభారత్ పై రాళ్ల దాడులు నిత్యకృత్యమయ్యాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు కొందరినీ అదుపులోకి తీసుకున్నారు.
అయితే బెంగళూరు రైల్వే సెక్షన్ లోని మైసూర్-చెన్నై మధ్య వందేభారత్ రైలుపై రాళ్ల దాడి ఆగలేదు. మినిమం గ్యాప్స్ లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో రైల్వే పోలీసులు ఈ లైన్లో నిఘా పెంచారు. మఫ్టీలో గస్తీ కాయడం ప్రారంభించారు. ఎలాగైతేనేం వందేభారత్ పై రాళ్లు రువ్వే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రెగ్యులర్ గా అతడే ట్రయిన్ పైకి రాళ్లు రువ్వుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకిలా చేస్తున్నావంటూ అడిగిన ప్రశ్నకు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానంతో పోలీసులు షాక్ అయ్యారు.
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వమని అతడికి దేవుడు చెప్పాడట.. అలా చేస్తే ప్రతిరోజు అతడికి తినడానికి తిండి దొరుకుతుందుట.. అందుకే ఆ రైలు వచ్చిన ప్రతిసారి దానిపైకి రాళ్లు విసురుతున్నట్టు చెప్పాడతను.ఆ వ్యక్తి పేరు అభిజిత్ అగర్వాల్ అని 36 ఏళ్లు ఉన్న ఇతడికి మతిస్థిమితం లేదని పోలీసులు గుర్తించారు. అభిజిత్ రైల్వే పక్కనే నివసిస్తున్నాడు. అక్కడే తిని అక్కడే పడుకుంటాడు.
ఈ క్రమంలోనే ఏమైందో కానీ వందేభారత్ రైళ్లపై రాళ్లు విసరడం ప్రారంభించాడు. ఇలా రాళ్లు విసిరి పారిపోయేవాడు. ఎట్టకేలకు గస్తీ నిర్వహించి మరీ అతడిని పోలీసులు పట్టుకున్నారు. తీరా చూస్తే మతిస్థిమితం లేని వాడు అని గుర్తించారు. అయినా రైల్వే చట్టంలోని సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపారు.