Begin typing your search above and press return to search.

అంబానీ కొడుకు పెళ్లిని తలదన్నే పెళ్లి ఇదీ

By:  Tupaki Desk   |   1 March 2020 5:58 AM GMT
అంబానీ కొడుకు పెళ్లిని తలదన్నే పెళ్లి ఇదీ
X
దేశంలోనే నంబర్ 1 అపర కుబేరుడు, రిలయన్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడి పెళ్లి అప్పట్లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి దేశంలో సినీ - రాజకీయ రంగ ప్రముఖులంతా హాజరయ్యారు. శ్రీమంతుడి ఇంట జరిగిన ఈ పెళ్లి వందల కోట్లు ఖర్చు చేశారు. నభూతో నభవిష్యతి అన్న చందంగా చేసిన ఈ పెళ్లిని చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కానీ ఇప్పుడు అంతకుమించిన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లిని తలదన్నేలా.. అంతకంటే భారీగా ముఖేష్ పెళ్లి జరిపించిన కళాకారులు - ఈవెంట్ మేనేజర్లతోనే అంతుకుమించిన పెళ్లిని జరిపిస్తున్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు. ఆయన కుమార్తె వివాహానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి ప్రాణ స్నేహితుడే బళ్లారి శ్రీరాములు. ఈయనకు మంత్రి పదవి రావడానికి గాలియే కారణం. మంత్రి శ్రీరాములు కూడా గాలి మైనింగ్ లో పార్ట్ నర్. అందుకే ఆయన తన కుమార్తె పెళ్లిని గాలి జనార్ధన్ రెడ్డి సహాయ సహకారాలతో అదిరిపోయే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు.

కుమార్తె పెళ్లి వేడుకకు హాజరు కావాలని ప్రధాని మోడీ - అమిత్ షా - జేపీ నడ్డా - కర్ణాటక సీఎం యడ్డీతో సహా పలు రాష్ట్రాల సీఎంలు - బీజేపీ - కాంగ్రెస్ ముఖ్యనేతలను మంత్రి శ్రీరాములు కలిసి స్వయంగా ఆహ్వానించాడు. దాదాపు 9 రోజుల పాటు ఈ పెళ్లి వేడుక నిర్వహిస్తారట.. ఫిబ్రవరి 27నుంచే పెళ్లి వేడుక మొదలైంది. 300మంది కళాకారులు - 200 మంది నిపుణులు.. కుమార్తె ఫ్రెండ్స్ కోసం స్టార్ హోటల్స్ బుకింగ్ - పెళ్లి కోసం భారీ సెట్టింగ్ లు మొత్తం బెంగళూరు ప్యాలెస్ లోని 40 ఎకరాల స్థలంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. మార్చి 5వ తేదీన శ్రీరాములు పెళ్లి వేడుకకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంబానీ కొడుకు పెళ్లికంటే భారీగా కోట్లు ఖర్చు చేస్తున్న ఈ వేడుక చరిత్రలో నిలిచిపోవడం ఖాయమంటున్నారు.