Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే రాజాసింగ్ మీద రౌడీషీల్ కలకలం

By:  Tupaki Desk   |   19 Dec 2019 4:53 AM GMT
ఎమ్మెల్యే రాజాసింగ్ మీద రౌడీషీల్ కలకలం
X
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మీద రౌడీషీట్ నమోదైన విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఉన్నతాధికారులకు మంగళ్ హాట్ పోలీసులు సమర్పించిన రౌడీషీటర్ల జాబితాలో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉండటం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటం సంచలనంగా మారింది.

మంగళ్ హాట్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు వెస్ట్ జోన్ పోలీసులు పలువురిని డీసీపీ కార్యాలయానికి పిలిపించారు. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్ల చేత సంతకాలు చేయించారు. ఈ క్రమంలో ఇదే జాబితాలో వరుసలో 24వ పేరు ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉండటంతో కలకలకంగా మారింది.దీన్ని ఫోటోలు తీసుకున్న కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో ఈ విషయం వెలుగు చూసింది. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని.. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని.. అలాంటి తనను తెలంగాణ పోలీసులు రౌడీ షీటర్ గా ఉంచటం దారుణంగా అభివర్ణించారు.

గతంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైనా రౌడీషీట్ ఉండేదని.. వారి పేర్లను ఇప్పుడు జాబితాలో పెట్టే దమ్ముందా? అంటూ రాజాసింగ్ సవాలు విసిరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆరే అసెంబ్లీలో ప్రశ్నిస్తానని చెప్పారు. తనపై పోలీసులు రౌడీషీట్ పెట్టటంపై రాష్ట్ర హోంమంత్రి సమాధానం ఇవ్వాలన్నారు. ఇదిలా ఉంటే 2006కు ముందు రాజాసింగ్ మీద మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్ పైన మొత్తం 16 కేసులు ఉండటం గమనార్హం.మరి.. రాజాసింగ్ సవాలుపై రాష్ట్ర హోంమంత్రి రియాక్ట్ అవుతారా?