Begin typing your search above and press return to search.

ఈ టీచర్ మహా హాట్ గురూ ...స్టూడెంట్స్ తో నగ్నంగా వీడియో కాల్స్ !

By:  Tupaki Desk   |   10 Nov 2020 5:00 AM IST
ఈ టీచర్ మహా హాట్ గురూ ...స్టూడెంట్స్ తో నగ్నంగా వీడియో కాల్స్ !
X
టీచర్ .. ఈ ప్రపంచం లో ఈ పదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తల్లి ,తండ్రి తర్వాత గురువుకి మాత్రమే అంతటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే , అప్పుడప్పుడు కొందరు చేసే వికృత చేష్టల వల్ల మొత్తం ఉపాద్యాయ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. తాజాగా ఓ టీచరమ్మ స్టూడెంట్స్ కి మంచి పాఠాలు చెప్పాల్సింది పోయి , కామ పాఠాలు చెప్తూ , టీనేజర్ల నుండి భారీగా డబ్బు గుంజుతుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా స్కూల్ మూతబడ్డాయి. అయతే స్పెయిన్ లో సైతం అదే పరిస్థితి నెలకొంది. విద్యార్ధుల చదువులకు బ్రేక్ పడకూడదని స్పెయిన్ లో పలు స్కూల్స్ ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పిల్లల కోసం సోషల్ మీడియా గ్రూపులు క్రియేట్ చేసి, టీచర్లు పాఠాలు కూడా ఇస్తున్నారు. అయితే , ఆ ఆన్లైన్ క్లాసులు కొన్ని చోట్ల పక్క దారులు పడుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే ... స్పెయిన్ లోని ముర్సియా ప్రాంతంలో స్థానిక పాఠశాలలో పాఠాలు చేప్పే డోనా అనే మహిళకు అక్రమ మార్గంలో డబ్బు సంపాదనపై మనస్సు పుట్టింది. ఇంకేముందు అనుకున్నదే తడవుగా తన స్టూడెంట్స్ లో కొందరు టీనేజీ కుర్రాళ్లను టార్గెట్ చేసుకుంది. వాళ్లతో వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసిన అందులో తన అసభ్యకర వీడియోలు పెడుతూ ఉండేది. అలాగే , తనతో నగ్నంగా ప్రైవేటుగా చాట్ చేసేందుకు స్టూడెంట్స్ నుంచి డబ్బులు లాగేది. ఈ క్రమంలో మార్టిన్ అనే కుర్రాడు టీచర్ వలపు వలలో పడ్డాడు. ఆమెతో రోజు నగ్నంగా వీడియో కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. పగలు రాత్రి తేడా లేకుండా చేసేవాడు. దీని కోసం తన తల్లి వాడే క్రెడిట్ కార్డును ఉపయోగించేవాడు. అయితే గత నెల క్రెడిట్ కార్డు బిల్లు భారీగా రావడంతో మార్టిన్ తల్లికి అనుమానం వచ్చి, డబ్బు గురించి ఆరా తీయగా టీచర్ అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అవుతున్నాయి అని వెల్లడైంది.

దీనితో స్కూల్ ఫీ కడుతున్నా కూడా మళ్లీ టీచర్ కి డబ్బు ఎందుకు అని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడంతో అసలు వ్యవహారం బయటపడింది. టీచర్ డోనా పలువురు విద్యార్థులను తన వలపు వలలో వేసుకొని వారందరితో గ్రూపు చాట్ చేస్తూ కావాల్సిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని నగ్నంగా వీడియో చాట్ చేస్తున్న సంగతి బయటపడింది. ఈమె వలలో అప్పటికే దాదాపు 30 మంది విద్యార్థులు పడి డబ్బులు ఇచ్చారని స్కూలు యాజమాన్యం విచారణలో తేలింది. దీంతో ఆమెను విధుల్లోంచి తొలగించి...ఆ స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆ టీచర్ ను అదుపులోకి తీసుకోని , విచారణ చేస్తున్నారు.