Begin typing your search above and press return to search.

మీరు పాల్గొనే శృంగారం అందంగా ఉండాలా..? అయితే ఈ టిప్స్ పాటించండి..

By:  Tupaki Desk   |   10 Jan 2023 7:50 AM GMT
మీరు పాల్గొనే శృంగారం అందంగా ఉండాలా..? అయితే ఈ టిప్స్ పాటించండి..
X
శృంగారం ఆరోగ్యకరం.. ఎంతలా అంటే ఎలాంటి ఒత్తిడినైనా ఇది మాయం చేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలను కదిలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే శృంగారం ఆరోగ్యకరంగా మారాలంటే ఇందులో అందంగా పాల్గొనాలి. అందుకు కొన్ని పద్దతులు పాటించాలి. అందమైన శృంగారం ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనసులో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. అందమైన శృంగారం ఎలా ఉంటుంది...? అనే విషయాలపై ఇప్పటికే చాలా కథనాలు చదివాం. అయినా కొందరు కొన్ని తప్పులు చేస్తున్నారు. శృంగారంలో పాల్గొన్న భాగస్వాములిద్దరు చిన్న చిన్న తప్పులే చేస్తున్నారు. దీంతో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఇరువురూ సంభోగానికి దూరమవుతున్నారు. అయితే ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడానికి ఓ ప్లాన్ వేసుకోండి. దానికి సంబంధించిన కొన్ని టిప్స్ తెలుసుకోండి..

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు... ఈ సామెత శృంగారంలో పాల్గొనే వారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే భాగస్వామితో ప్రేమగా మాట్లాడితే మీకు లొంగిపోతుంది. తిరిగి మీకు మరింత ప్రేమను అందిస్తుంది. ప్రేమతో చేసే శృంగారం అధిక ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల భార్యభర్తల మధ్య ప్రేమ వాతావరణం కల్పించుకోవాలి. ఒకరి తప్పును మరొకరు క్షమించాలి. తాను క్షమిస్తున్నాడని చిన్నచూపు చూడకుండా.. వారి విజయానికి వెన్నంటూ ఉండాలి. ఇలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మెరుగైన శృంగారానికి తోడ్పడుతుంది.

శృంగారంలో పాల్గొన్న భాగస్వాములిద్దరికీ ఒకేసారి తృప్తి జరగకపోవచ్చు. మగవారిలో వీర్యం పడిపోతే వారు ఇక శృంగార క్రీడకు పులిస్టాప్ పెట్టినట్లే . అయితే స్త్రీలల్లో తొందరగా భావప్రాప్తి కలగదు. అందువల్ల అంగాన్ని ప్రవేశించే ముందు ఫోర్ ప్లే చేయాలి. వారి సున్నిత భాగాలను టచ్ చేయడం వల్ల వారిలో సెక్స్ కోరికలు ప్రేరేపితం అవుతాయి. ఆ తరువాత అసలు క్రీడలో పాల్గొనడంతో వారిలోనూ భావప్రాప్తి కలుగుతుంది.

నేటి కాలం దంపతులు రొటిన్ సెక్స్ ను ఇష్టపడడం లేదు. శృంగారంపై పలు మార్గాల ద్వారా అవగాహన కలగడంతో భంగిమలు మార్చాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరు సహకరించుకోవడం మంచిది. ఇద్దరిలో ఒకరికి నచ్చకపోతే బలవంతం పెట్టద్దు. అంతేకాకుండా ప్రతి రోజూ ఒకే బెడ్ రూంలో శృంగారంలో పాల్గొనడం తృప్తి కాకపోవచ్చు. అందువల్ల వెకేషన్ ఏర్పాటు చేసుకొని ప్రత్యేక ప్రదేశాల్లో శృంగారం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

నిత్యం ఏదో ఒక పనితో బిజీగా ఉంటారు. అయినా ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడానికి కాస్త టైం కేటాయించండి. శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎలాంటి ఒత్తిడి ఉన్నా దూరం అవుతుంది. ప్రతిరోజూ శృంగారానికి ఆహ్వానించడం ద్వారా భాగస్వామికి మీ మీద ప్రేమ అధికం అవతుంది. దీంతో సంసార జీవితం కూడా బాగుంటుంది. అందువల్ల ప్రతిరోజూ కచ్చితంగా శృంగారంలో పాల్గొనేలా ప్లాన్ వేసుకోండి.

చాలా మంది పురుషులు శృంగారంలో పాల్గొన్నప్పుడు తమకు భావప్రాప్తి కలగగానే పక్కకు వెళ్తారు. కానీ ఆ తరువాత కూడా భాగస్వామితో కబుర్లు చెప్పుకుంటూ వారితో కలిసే నిద్రించడం మంచిది. దీంతో భాగస్వామికి ఏదో పనికానిచ్చి వెళ్లాడన్న భావన రాదు. లేదంటే తానో మిషన్ అనుకొని మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడే ప్రమాదం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.