Begin typing your search above and press return to search.

మేనత్తతో శృంగారం.. చివరకు ఎక్కడి వరకూ వెళ్లిందంటే?

By:  Tupaki Desk   |   20 July 2020 10:10 AM GMT
మేనత్తతో శృంగారం.. చివరకు ఎక్కడి వరకూ వెళ్లిందంటే?
X
హద్దులు చెరిగిపోతున్నాయి. అక్కడెక్కడో సదూర తీరాన ఉండే దేశాల్లో జరుగుతుంటాయనే భాగోతాలు అప్పుడప్పడు మాత్రమే దేశంలో చోటు చేసుకునేవి. తాజాగా మారిన పరిస్థితులతో ఇప్పుడు దారుణమైన ఉదంతాలు తరచూ తెర మీదకు వస్తున్నాయి. వావివరసులు మర్చిపోయి వ్యవహరిస్తున్న ఉదంతాలు అనుబంధాలకు.. బంధాలకు కొత్త సవాలు విసురుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఈ కోవకు చెందిందే.

యూపీలోని కాన్పూరుకు చెందిన రవీందర్ అనే లారీ డ్రైవర్ ఉన్నాడు. అతడి భార్య పూనంతో కలిసి ఉంటున్నాడు. ఇలా సాగుతున్న వారి జీవితంలోకి రవీందర్ మేనల్లుడు అజయ్ ఊరికి వచ్చాడు. చదువుకునేందుకు వచ్చిన అతగాడ్ని.. తన ఇంట్లో ఉంచుకునేందుకు ఓకే చెప్పాడు. తిన్నింటి వాసాలు లెక్కేసేలా అజయ్ తీరు మారింది. అత్త పూనంతో పరిచయం పెంచుకున్న అజయ్.. తన హద్దుల్ని దాటేశాడు.

వయసులో తనకంటే చిన్నవాడైనా.. అతడి చేష్టలకు అడ్డుచెప్పని పూనం తీరుతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం షురూ అయ్యింది. అర్థరాత్రి దాటిన తర్వాత అజయ్ గదికి వచ్చే పూనం.. అతడితో కోరికలు తీర్చుకునేది. ఈ భాగోతం రవీందర్ కు తెలిసిందే. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
దీంతో.. తమ మధ్యనున్న అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్న మేనమామను చంపేయాలన్న దుర్మార్గమైన ప్లాన్ వేశాడు అజయ్. అందుకు పూనం కూడా ఓకే చెప్పటంతో.. భర్త తినే ఆహారంలో విషం కలిపి చంపేశారు. అనంతరం డెడ్ బాడీని బెడ్ షీట్ లో చుట్టేసి.. బస్తాలా కుక్కి ఎవరికి అనుమానం రాకుండా రైలు పట్టాలపై పడేశారు. దీన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనపై రవీందర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. అనుమానం కలిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూనంను అదుపులోకి తీసుకొని విచారణ మొదలెట్టారు. పోలీసుట ట్రీట్ మెంట్ తో తాము చేసిన దారుణాన్ని కక్కసింది పూనం. భర్తను చంపిన వైనాన్ని ఒప్పుకుంది. దీంతో.. అజయ్.. పూనంను అరెస్టుచేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.