Begin typing your search above and press return to search.

స్ట్రెచర్ పైన శృంగారం.. నర్సు ఒత్తిడికి వార్డు బాయ్ ఏం చేశాడంటే?

By:  Tupaki Desk   |   31 Oct 2020 6:00 AM IST
స్ట్రెచర్ పైన శృంగారం.. నర్సు ఒత్తిడికి వార్డు బాయ్ ఏం చేశాడంటే?
X
ఈ కాలంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? అమ్మాయి కనపడితే చాలు సొల్లు కార్చుకొని ఆమె వెంట వెళ్లిపోయే మగాళ్లు ఎంతో మంది. ఇంటా బయటా అమ్మాయిలపై లైంగిక వేధింపులు కోకొల్లలు. అయితే ఇక్కడో వార్డ్ బాయ్ తన ఆస్పత్రిలో పనిచేసే నర్సు బంపర్ ఆఫర్ ఇచ్చినా కూడా కాలదన్నాడు. స్ట్రెచర్ పైన శృంగారం చేద్దామన్నా ససేమిరా అన్నాడు.. చివరికి వీరి కథ ఏమైందంటే? మహారాష్ట్రలోని పర్బాని జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్ గా పనిచేస్తున్న సచిన్ మిట్కూరీకి ఇటీవలే పెళ్లి అయ్యింది. సంసార జీవితాన్ని ప్రశాంతంగా అనుభవిస్తున్నాడు. అతడితోపాటు ఆస్పత్రిలో పనిచేసే ఒక నర్సు సచిన్ ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. అనారోగ్యంతో తన భర్త మరణించడంతో ఆ నర్సు సచిన్ పై మోజు పడింది. పెళ్లికి ముందే శృంగారం చేద్దామని అతడిని వేధించింది. ఈ విషయాన్ని సచిన్ పెద్దగా పట్టించుకోలేదు.

తాజాగా స్ట్రెచర్ పైన శృంగారం చేద్దాం రా అంటూ అసభ్యంగా అతడితో ప్రవర్తించింది. చాలాసార్లు తప్పించుకున్న సచిన్ చివరకు ఒప్పుకోలేదు. దీంతో నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకోకపోతే నీపై లైంగిక కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తా.. నీ ఉద్యోగం పోతుందని బెదిరించింది.

కొత్తగా పెళ్లి కావడం.. భార్యకు చెప్పలేక.. మథనపడ్డ యువకుడు సచిన్ భార్య బయటకు వెళ్లిన సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు నర్సును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.