Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు వెనుక ఆ హీరో పాత్ర?

By:  Tupaki Desk   |   21 May 2023 12:00 PM GMT
నోట్ల రద్దు వెనుక ఆ హీరో పాత్ర?
X
సాధారణంగా సమాజంలో జరిగే ఎలాంటి మంచి, చెడు విషయాన్నైనా సినిమాలకు ముడిపెడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలా ప్రస్తుత కాలంలో మూవీలు సొసైటీపై తీవ్ర స్థాయిలోనే ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిసిందే.

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సంచలనం అయిన అంశాల్లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ఒకటి. ఇటీవలే ఈ కరెన్సీ నోట్లను రద్దు చేయబోతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. కానీ, ఆ నోట్లకు బ్యాంకులకు తిరిగి అప్పగించేందుకు సెప్టెంబర్ వరకూ గడువును ఇచ్చింది. ఇప్పుడీ వ్యవహారాన్ని ‘బిచ్చగాడు’ సినిమాతో ముడి పెడుతోన్నారు.

నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకు మధ్య ఉన్న లింకేంటి అని మీకు డౌట్ రావొచ్చు. నిజమే.. ఈ రెండీటికి అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ, గతంలో వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమాలో దేశ ఆర్థిక పరిస్థితి మారాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాలని చూపించారు. ఆ వెంటనే మోదీ ప్రభుత్వం రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక, ఇప్పుడేమో ‘బిచ్చగాడు 2’ సినిమా వచ్చింది. అది విడుదలైన రోజే రూ. 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ రెండు పర్యాయాల్లో విజయ్ ఆంటోనీ సినిమా రావడం యాదృశ్చికంగానే జరిగినా.. ఈ అంశాలకు సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటోన్నారు. అంతేకాదు, హీరో విజయ్ ఆంటోనీ పాత్ర ఉందని మీమ్స్ చేస్తున్నారు. అలాగే, ‘నోట్ల రద్దు గురించి నీకెలా తెలుసు బ్రో’.. ‘నువ్వు హీరోవా? జోతిష్కుడివా బ్రదర్’ అంటూ తమదైన రీతిలో కామెంట్లను కూడా చేస్తున్నారు.

మొత్తానికి నోట్ల రద్దు వ్యవహారం వల్ల ‘బిచ్చగాడు 2’ సినిమాకు కూడా బాగానే కలిసి వస్తుందనే చెప్పాలి. ఈ రెండింటికీ ముడి పెట్టడం వల్ల ఈ సినిమా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఫలితంగా ఇందులో ఏముందో అని చాలా మంది సినిమాను చూస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతోన్నాయి.