Begin typing your search above and press return to search.
జగనన్న రాముడు...భారతమ్మ సీత:రోజా
By: Tupaki Desk | 28 Aug 2018 4:34 PM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులను, కొన్ని సందర్భాల్లో అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఆ పాదయాత్రను జగన్ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబానికి దూరంగా ఉంటోన్న జగన్....ఎన్నో పండుగలు - ప్రత్యేక సందర్భాలను త్యాగం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన రాఖీ పండుగనాడు ....తన సోదరి షర్మిల చేత రాఖీ కట్టించుకోలేకపోయానని, ఆమెను మిస్ అవుతున్నానని జగన్ ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో నేడు జగన్...తన జీవితంలో మరో ప్రత్యేకమైన సందర్భం అయిన పెళ్లిరోజు నాడు తన భార్య వైఎస్ భారతిని మిస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్, భారతిలకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నగరి ఎమ్మెల్యే రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
పాదయాత్రలో ఉన్న జగన్ కు రోజా రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే. నేడు జగన్ పెళ్లిరోజు సందర్భంగా రోజా వినూత్న తరహాలో శుభాకాంక్షలు తెలిపారు. జగన్ - భారతిల పెళ్లి నాటి ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసి....ఆసక్తికర కామెంట్ చేశారు. "సీతమ్మ లాంటి భారతమ్మ దొరికినందుకు జగనన్నకి, రాముడు లాంటి జగనన్న భర్తగా దొరికినందుకు భారతమ్మకి... ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో శివపార్వతుల్లాగా కలిసి ఉండాలి అని మనసారా కోరుకుంటన్నాము...!!! హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్న& వదినమ్మ" అని రోజా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుతోంది.