Begin typing your search above and press return to search.

రోజాపై వార్ ఎఫెక్ట్!.. బండ్ల‌పై పోలీస్ కంప్లైంట్‌!

By:  Tupaki Desk   |   15 Dec 2017 10:15 AM GMT
రోజాపై వార్ ఎఫెక్ట్!.. బండ్ల‌పై పోలీస్ కంప్లైంట్‌!
X
వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై వాద‌న‌కు దిగి అస‌భ్య ప‌దాల‌ను వాడిన టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమాని బండ్ల గ‌ణేశ్ తీవ్ర చిక్కుల్లోనే ప‌డిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఓ లైవ్ షో పాలుపంచుకున్న సంద‌ర్భంగా ఫోన్ లైన్‌ లోకి వ‌చ్చిన రోజాపై బండ్ల గ‌ణేశ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. త‌న అభిమాన హీరో అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ను వాడు - వీడు అంటారేంట‌ని ప్ర‌శ్నించిన బండ్ల... ఆ వివాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఏ విష‌యంపై అయినా కాస్తంత స్ట్రైట్‌ గానే మాట్లాడే రోజా... బండ్ల గ‌ణేశ్ కు షాకిస్తూ స‌వ్యంగా మాట్లాడాల‌ని చెప్ప‌డంతో పాటు హ‌ద్దు దాటితే ఇబ్బంది త‌ప్ప‌ద‌ని కూడా హెచ్చిరిక‌లు జారీ చేశారు. ఈ వివాదం అక్క‌డితోనే ముగిసింద‌నుకున్నా... ప‌వ‌న్ ఫ్యాన్స్ దీనిని మ‌రింత‌గా పెద్ద‌ది చేసేశారు.

ఇందులో భాగంగా విజ‌య‌వాడ‌కు చెందిన వైసీపీ మ‌హిళా నేత‌లు నేటి మ‌ధ్యాహ్నం నేరుగా విజ‌య‌వాడ న‌గ‌ర క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వెళ్లారు. త‌మ పార్టీకి చెందిన మ‌హిళా నేత‌పై అస‌భ్య ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డ బండ్ల గ‌ణేశ్ ను అరెస్ట్ చేయ‌డంతో పాటు అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. వైసీపీ మ‌హిళా నేత‌లు ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు... బండ్ల‌పై పోలీసు కేసు న‌మోదుకు సంబంధించిన చ‌ర్య‌ల‌పై ప‌రిశీల‌న చేస్తున్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన వైసీపీ మ‌హిళా నేతలు బండ్ల గ‌ణేశ్ వ్య‌వ‌హార స‌ర‌ళిని ప్ర‌శ్నిస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ మ‌హిళా నేత అన్న విష‌యాన్ని కూడా మ‌రిచి బండ్ల అస‌భ్యక‌ర వ్యాఖ్య‌లు చేశాడ‌ని - అత‌డు చేసింది ముమ్మాటికీ నేర‌మేన‌ని - అందుకే అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు.

అయినా తెలంగాణ‌కు చెందిన బండ్ల‌కు ఏపీలో సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌గానే కాకుండా మ‌హిళా నేత‌ల్లో మంచి ప‌రిణ‌తి క‌లిగిన రోజాను నోటికొచ్చినట్లు మాట్లాడితే స‌హించేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. వంద సినిమాల‌కు పైగా హీరోయిన్‌ గా న‌టించిన రోజా... సినిమా రంగంలోనూ టాప్ హీరోయిన్‌ గా ఎదిగార‌ని, అదే విధంగా రాజకీయాల్లోకి ప్ర‌వేశించిన రోజా ఇక్క‌డ త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించార‌ని గుర్తు చేశారు. అలాంటి రోజాపై అస‌భ్య ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డ‌ బండ్ల గ‌ణేశ్ త‌ప్పు చేయ‌లేద‌ని వాదిస్తే స‌రిపోద‌ని - తాను త‌ప్పు చేయ‌లేద‌ని భావిస్తే... బండ్ల త‌న ఫోన్‌ ను ఎందుకు స్విచ్ ఆఫ్ చేశార‌ని ప్ర‌శ్నించారు. రోజాపై చేసిన వ్యాఖ్య‌ల‌కు బండ్ల గ‌ణేశ్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వారు డిమాండ్ చేశారు. మొత్తానికి వీరాభిమానం ప్ర‌ద‌ర్శించిన బండ్ల గ‌ణేశ్ తీవ్ర ఇబ్బందుల్లోనే ప‌డిపోయార‌న్న మాట‌.