Begin typing your search above and press return to search.

రోజా ప్ర‌శ్నిస్తే బండ్ల గ‌ణేష్ రాళ్లేశాడు

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:14 AM GMT
రోజా ప్ర‌శ్నిస్తే బండ్ల గ‌ణేష్ రాళ్లేశాడు
X
ఓ టీవీ చాన‌ల్ చ‌ర్చాగోష్టిలో..వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా - సినీ న‌టుడు బండ్ల గ‌ణేష్ మ‌ధ్య వాదోప‌వాదాలు సాగాయి. స‌ద‌రు చ‌ర్చ‌లో ఫోన్ లైన్లో రోజా మాట్లాడుతుండ‌గా...స్టూడియోలో ఉన్న గ‌ణేష్ ఈ సంద‌ర్భంగా రోజాపై మండిప‌డ్డారు. రోజా ప‌ళ్లు రాల‌గొడ‌తానంటూ హెచ్చ‌రించారు. గ‌ణేష్ ఇంత‌గా బెదిరించేందుకు కార‌ణం జ‌న‌సేన‌ అదినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ పై చేసిన కామెంట్ల‌ను రోజా తప్పుప‌ట్ట‌డ‌మే.

ఆ టీవీ చ‌ర్చ‌లో వారసత్వ రాజ‌కీయాలు - ప్ర‌జాభిమానం గురించి చ‌ర్చ న‌డుస్తుండ‌గా రోజాను ఫోన్ లైన్లోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిని వార‌స‌త్వ నాయ‌కుడిగా చూడ‌లేమ‌న్నారు. `వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాభిమానంతో ముందుకు వెళుతూ 67 మందిని గెలిపించుకొని ముందుకు సాగుతున్నాడు. ఆయన ముందుకు సాగుతున్న తీరును వార‌స‌త్వం రాజకీయం అన‌లేం. అలాంట‌పుడు, అన‌వ‌స‌ర‌మైన స‌మ‌యంలో,అన‌వస‌రంగా జ‌గ‌న్‌ను అనాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ఏం వ‌చ్చింది?జ‌గ‌న్ ఏ రోజు ప‌వ‌న్ గురించి మాట్లాడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ మాట్లాడుతున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఎంపీగా త‌న తండ్రి కార‌ణంగా బ‌రిలో నిలుచున్నారేమో కానీ ఈ 8 ఏళ్ల‌లో త‌న‌కంటూ ఒక పార్టీ పెట్టుకొని సిద్ధాంతాలు తీర్చిదిద్దుకొని ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం ముందుకు సాగుతున్నారు. అంతే త‌ప్ప టైం పాస్ రాజ‌కీయాలు చేయ‌ట్లేదు. అందుకే ఆయ‌న్ను అనే నైతిక హ‌క్కు లేదు` అని రోజా స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా `చిరంజీవి గారి ఇంట్లో త‌క్కువమంది క‌ష్ట‌ప‌డిన వారు ఉన్నారు. ఎన్టీఆర్‌ - ఏఎన్నార్‌ - కృష్ణంరాజు - కృష్ణ ప్ర‌ముఖ న‌టులుగా ఉన్న స‌మ‌యంలో వాళ్లంద‌రినీ తోసిరాజ‌నే విధంగా క‌ష్ట‌ప‌డి నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరారు. కానీ చిరు త‌మ్ముళ్లు - కొడుకు - మేన‌ల్లుడు - చిన్న‌ అల్లుడు ..కేవ‌లం చిరు చ‌రిష్మాతో వ‌స్తున్నారు. వాళ్ల‌ది వార‌స‌త్వం` అంటూ రోజా మాట్లాడుతుండ‌గా... బండ్ల గ‌ణేష్ ఆ చ‌ర్చ‌కు అడ్డుప‌డ్డారు. దీంతో ఎమ్మ‌ల్యే రోజా `అభిమానిగా మీరు మాట్లాడితేనే నేనేం చేయ‌లేను. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గురించి జ‌గ‌న్ ఎనాడైనా మాట్లాడారా? అయినా ఆయ‌న విమ‌ర్శ‌లు ఎందుకు? ` అంటూ ప్ర‌శ్నించారు. దీనిపై గ‌ణేష్ స్పందిస్తూ `ఆడు ఈడు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను విమ‌ర్శించ‌డం స‌రికాదు` అన్నారు. దీంతో రోజా`మీరు ఆవేషం త‌గ్గించుకోండి. పాయింట్ మీద మాట్లాడండి` అని సూచించ‌గా... ``అలా మాట్లాడ‌టం రాదు. అలా పాయింట్ మీద మాట్లాడ‌టం వ‌ల్లే ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లు ఓడిపోయి ఓ సారి ఎమ్మెల్యే అయ్యారు. దేశం మొత్తం మీ గోల్డెన్ లెగ్ గురించి కోడై కూస్తోంది.

మీరు ఆయ‌న‌తో ఉండాల‌ని వేరే వైపు రావ‌ద్దు..అక్క‌డే ఉండండి. మీది గోల్డెన్ లెగ్‌. అందుకే వైఎస్‌ ను పైకి పంపించారు`` అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో తీవ్రంగా ఆవేద‌న చెందిన `నేనేమైనా ద‌గ్గ‌రుండి పైకి పంపించానా? ఇలా మాట్లాడ‌టం ఏంటి. నువ్వు ఏమైనా ప‌క్క‌న ఉండి ప‌క్క‌లు వేస్తున్నావా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు? ` అంటూ అన‌డంతో `నీ ప‌ళ్లు రాలిపోతాయి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను ఏమైనా అన్నావంటే`` అంటూ విరుచుకుప‌డ్డారు. దీంతో ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ `రా...ఎవ‌రివి రాలుతాయో చూద్దాం` అంటూ ఘాటు స‌మాధానం ఇచ్చారు. `ఏం మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యేవా నువ్వు ? కామ‌న్స్ సెన్స్ ఉందా? నువ్వు హీరోయిన్‌ గా స్ట్రెయిట్ గా వ‌చ్చావా?` అంటూ గ‌ణేష్ మ‌రో అంశంపైకి త‌న వాదాన్ని మ‌ళ్లించారు.