Begin typing your search above and press return to search.

రోజంతా రోజా కేసే..

By:  Tupaki Desk   |   21 April 2016 9:47 AM GMT
రోజంతా రోజా కేసే..
X
సుప్రీంకోర్టులో గురువారం ఒక ధర్మాసంనలో దాదాపుగా రోజంతా ఒకే కేసు వాదనలు నడిచాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. గురువారం ఉదయం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైన వెంటనే సుప్రీం ధర్మాసనం... తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ రోజా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది. రోజా తరఫున గతంలో ఆమె పక్షాన వాదనలు వినిపించిన ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగే... ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన క్లెయింట్ పై ఏపీ శాసనసభ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని, సహజ న్యాయసూత్రాలకు సభ నిర్ణయం విరుద్ధమేనని జైసింగ్ వాదించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జైసింగ్ గుక్క తిప్పుకోకుండా తన వాదనలు వినిపించారు.

ఇందిరా జైసింగ్ వాదనలను సుప్రీంకోర్టు పూర్తిగా విన్న తరువాత లంచ్ సమయం విచారణ జరుపుతామని చెప్పింది. మధ్యాహ్న భోజనం తర్వాత కూడా ఈ కేసుపైనే వాదనలు వింటామని చెప్పింది. లంచ్ తరువాత కూడా ఇందిరాజైసింగ్ తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్న ఈ కేసుపై రాజకీయవర్గాలు, మీడియాలో ఆసక్తి ఏర్పడింది. దాదాపుగా గురువారమంతా ఈ కేసు వాదనలు కొనసాగడంతో దీనిపై ఈ రోజు నిర్ణయం వెలువడకపోవచ్చని భావిస్తున్నారు.