Begin typing your search above and press return to search.

ఆ వీడియోలు ఒకసారి చూడు పవన్: రోజా

By:  Tupaki Desk   |   21 Dec 2019 8:13 AM GMT
ఆ వీడియోలు ఒకసారి చూడు పవన్: రోజా
X
ఒక రాజధానికి ఎన్ని ఎకరాలు ఉండాలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు తెలుసుకోవాలని ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. లేకుంటే తమ మంత్రులు అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాల వీడియోలు వింటే మంచిదని సలహా ఇచ్చారు.

ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు ఇచ్చిన నివేదికపై రోజా స్పందించారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్ణయంపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

కర్నూలు రాజధానిపై పవన్ కళ్యాణ్ మాట మార్చారని..కావాలంటే పాత వీడియోలు చూసుకోవాలని రోజా హితవు పలికారు. చంద్రబాబుకు నచ్చినట్లు పవన్ మాటలు మారుస్తుంటారని ధ్వజమెత్తారు. ఆస్తులు కాపాడుకోవాలని చంద్రబాబు అండ్ కో తాపత్రయ పడుతున్నారన్నారు.

మూడు రాజధానులపై ఇప్పటికే జనసేనాని పవన్ తప్పుపట్టారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు భారీగా భూములు కొన్నారని ఆరోపించారు. దానికి కౌంటర్ గానే రోజా తాజాగా పవన్ పై ఆరోపణలు చేశారు.