Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు రోజా సెటైరిక‌ల్ ప్ర‌శ్న‌లు

By:  Tupaki Desk   |   24 Aug 2015 5:36 PM IST
చంద్ర‌బాబుకు రోజా సెటైరిక‌ల్ ప్ర‌శ్న‌లు
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌ముఖ సినీన‌టి, న‌గ‌రి వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా ధ్వ‌జ‌మెత్తారు. సోమ‌వారం ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు త‌నపై ఉన్న కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డి సీఎం కుర్చీని కాపాడుకునేందుకే మోడీతో భేటీ అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ సంద‌ర్భంగా ఈ క్రింది ప్ర‌శ్న‌ల‌ను ఆమె సంధించారు.

- మీరు ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం ఢిల్లీకి వెళుతున్నారా ? మీ స్టేట‌స్ కాపాడుకోవ‌డం కోసం వెళుతున్నారా ?

- మీరు ప్ర‌త్యేక హోదాకు అనుకూల‌మా...వ్య‌తిరేక‌మా ?

- కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే మీరు ఎన్డీయే ప్ర‌భుత్వంలో కొన‌సాగుతారా..వైదొల‌గుతారా ?

- కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే మీ రాష్ర్ట ప్ర‌భుత్వంలో బీజేపీ మంత్రుల‌ను ఉంచుతారా...తొల‌గిస్తారా.. ?

- విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆరు నెల‌ల్లో అమ‌లు చేయాల్సిన హామీల‌ను కేంద్రం నెర‌వేర్చ‌క పోయినా ఎందుకు నిల‌దీయ‌డం లేదు ?

- మీరు గ‌తంలో మోడీని క‌లిసిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదాపై ఏం చ‌ర్చించారో శ్వేత‌ప‌త్రం రిలీజ్ చేయ‌లేదే ?

ఈ ప్ర‌శ్న‌ల‌తో పాటు ఇంకా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప‌వ‌న్ కూడా టీడీపీకి మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ రైతుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని...వైకాపా ఈ నెల 29న త‌ల‌పెట్టిన రాష్ర్ట‌బంద్‌ ను అడ్డుకునేందుకు టీడీపీ ప్ర‌భుత్వం కుట్ర‌ప‌న్నుతోంద‌ని ఆమె ఆరోపించారు.