Begin typing your search above and press return to search.

రోజా మాట‌! కుట్ర‌ల‌కు బాబు బ్రాండ్ అంబాసిడ‌ర‌ట‌!

By:  Tupaki Desk   |   11 Aug 2017 3:19 PM IST
రోజా మాట‌! కుట్ర‌ల‌కు బాబు బ్రాండ్ అంబాసిడ‌ర‌ట‌!
X
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో అక్క‌డ అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల్సిందేన‌న్న భావ‌న‌తో అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీ కూడా వ్యూహ ప్ర‌తివ్యూహాలు ప‌న్నుతున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు నంద్యాల‌లో రెండు ప‌ర్యాయాలు ప‌ర్య‌టించ‌గా, ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. నిన్న నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ‌ల్లో మాట్లాడిన జ‌గ‌న్‌... టీడీపీ స‌ర్కారు పాల‌న‌పై ధ్వ‌జ‌మెత్తుతూ సీఎం చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబును ఉరి తీసినా త‌ప్పు లేద‌ని వ్యాఖ్యానించిన జ‌గ‌న్‌... మ‌రోమారు పెను క‌ల‌క‌ల‌మే రేపారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై అటు టీడీపీ నేత‌లు నానా హైరానా చేస్తున్నారు. జ‌గ‌న్ నోట నుంచి ఆ వ్యాఖ్య‌లు రావ‌డ‌మే ఆల‌స్యం అన్న చందంగా రంగంలోకి దిగేసిన టీడీపీ నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ ఆందోళ‌న‌ల‌కు దిగాయి. ఈ క్ర‌మంలో అస‌లు చంద్రబాబుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పేముంది అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - ఆ పార్టీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు - న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చారు. కాసేప‌టి క్రితం మీడియాతో మాట్లాడిన రోజా... చంద్ర‌బాబుపైనే కాకుండా ఆయ‌న సాగిస్తున్న పాల‌న‌పైనా నిప్పులు చెరిగారు. ఎదుటి వారిపై కుట్ర‌లు ప‌న్న‌డంలో బాబుకు సాటి రాగ‌ల వారెవ్వ‌రూ లేర‌ని పేర్కొన్న రోజా... చంద్ర‌బాబును కుట్ర‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా అభివ‌ర్ణించారు. మొద‌టి సారి ఎమ్మెల్యేగా మూలిగి ముక్కీ గెలిచిన చంద్ర‌బాబు... 1980 ద‌శకంలో కొత్త‌గా పుట్టిన పార్టీ టీడీపీ చేతిలో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యార‌ని ఆమె చెప్పారు.

అయితే త‌ద‌నంత‌ర కాలంలో త‌న‌ను ఓడించిన పార్టీలోనే చేరిపోయిన చంద్రబాబు... ఆ త‌ర్వాత పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీ రామారావుకే వెన్నున‌పోటు పొడిచి పార్టీ నుంచి బ‌హిష్క‌రించి, ఎన్టీఆర్ సంపాదించిన అధికారాన్ని లాగేసుకున్నార‌న్నారు. ఈ ఒక్క దృష్టాంతం చాలు చంద్ర‌బాబు ఎంత‌టి మోస‌గాడ‌న్న విష‌యం చాలు అని కూడా రోజా తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నాడు ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు... ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు హామీలు ఇస్తూ... ప్ర‌జాకంట‌క పాల‌న సాగిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. ఇలాంటి పాల‌న సాగిస్తున్న చంద్రబాబును ఉరి తీసినా త‌ప్పేనంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పేముంద‌ని కూడా రోజా ప్ర‌శ్నించారు.