Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు సాఫ్ట్ వేర్ బిరుదిచ్చిన రోజా

By:  Tupaki Desk   |   19 Oct 2016 8:24 AM GMT
చంద్ర‌బాబుకు సాఫ్ట్ వేర్ బిరుదిచ్చిన రోజా
X
సాఫ్టువేర్ ఇండ‌స్ర్టీ పితామ‌హుడిన‌ని చెప్పుకొనే హైటెక్ సీఎం చంద్ర‌బాబుకు ఆయ‌న త‌ర‌హాలోనే కొత్త బిరుదిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రాష్ట్రంలో కరువు తాండ‌విస్తోంద‌ని... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కరువు కు పాస్ వ‌ర్డు లాంటి వార‌ని ఆమె మండిప‌డ్డారు. శ్రీకాళహస్తిలో ప‌ర్య‌టిస్తోన్న ఆమె.. చంద్ర‌బాబు కరువు కు పాస్ వర్డ్ అని, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ కూడా ఆయ‌నేన‌ని అని ఎండ‌గ‌ట్టేశారు. చంద్ర‌బాబు తన సొంత జిల్లాలో చ‌క్కెర క‌ర్మాగారాల‌ను మూయించేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో కరువు ప‌రిస్థితిపై ఇంత‌వ‌ర‌కు ఏపీ స‌ర్కారు కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని.. రైతుల స‌మ‌స్య‌ల‌పై చంద్రబాబు ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న దానికి అదే పెద్ద ఉదాహ‌ర‌ణ అని రోజా ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు పాల‌న‌లో రైతుల‌కు కరువు , క‌న్నీళ్లు త‌ప్ప ఇంకేమీలేద‌ని అన్నారు.

మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళ‌మెత్తిన ఎమ్మెల్యేల‌కు నోటిసులివ్వ‌డంపైనా వైసీపీ మండిపడుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఈ విష‌యంలో మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకే అసెంబ్లీలో పోరాటం చేశామని అన్నారు. యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పోరాటం చేస్తే నోటీసులిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/