Begin typing your search above and press return to search.
రోజా విప్పిన ‘చిల్లర కష్టాల’ చిట్టా
By: Tupaki Desk | 15 Nov 2016 3:26 PM ISTఒక్క ప్రకటనతో తమను దారుణంగా దెబ్బ కొట్టిన ప్రధాని మోడీని రాజకీయంగా దెబ్బ కొట్టే అవకాశం కోసం ఎంతోమంది రాజకీయ నేతలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. అందుకేనేమో.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత రెండు.. మూడు రోజులవరకూ నోరు తెరిచేందుకు సైతం సాహసించని నేతలు పలువురు ఇప్పుడు అందుకు భిన్నంగా మోడీ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు ఎలాంటి కష్టాలు ఉండవని.. నల్ల కుబేరులకు షాకిస్తుందని భావించినా.. కేంద్రం చేసిన కొన్ని పొరపాట్లతో సామాన్యులు సైతం కిందామీదా పుడుతున్న పరిస్థితి.
జనాల కష్టాలతో ధైర్యం తెచ్చుకున్న పలువురు నేతలు.. వారి తరఫున మాట్లాడినట్లుగా మాట్లాడుతూ.. మోడీ చర్యను తీవ్రంగా తప్పు పడుతున్న వైనం గడిచిన రెండు రోజులుగా మరింత పెరిగింది.ఈ హడావుడి ఇలా సాగుతుంటే.. లోకల్ టాలెంట్ తో కొందరు చెలరేగిపోతున్నారు. అలాంటి లోకల్ టాలెంట్ లో ఏపీ విపక్షానికి చెందిన ఫైర్ బ్రాండ్ రోజా ఒకరు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు వినపడితే చాలు శివాలెత్తే ఆమె.. పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ లో ఆయన్ను బాధ్యుడ్ని చేస్తూ వినిపిస్తున్న వాదన వింటే ఎంతటి వారైనా అవాక్కు అవ్వాల్సిందే. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడితో లీకులు అందుకున్న చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని.. నల్లధనాన్ని మార్చుకునేందుకు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లినట్లుగా ఆరోపించారు.
ముందస్తు చర్యలు ఏమీ తీసుకోకుండానే పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రం కారణంగా ప్రజలు తీవ్ర కష్టాలకు గురి అవుతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా చిల్లర ఉంటేనే లోపలికి రావాలని.. లేకుంటే రావొద్దంటూ బోర్డులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న నేతలు ఏసీ గదులకు పరిమితం కాకుండా.. బయటకు వచ్చి చిల్లర నోట్ల కోసం ప్రజలు పడుతున్న కష్టాల్ని చూడాలని.. వారికి ఆ తిప్పలు తప్పించేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరుకుంటున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థిని తప్పు పట్టే ఏ చిన్న అవకాశం వదలని రోజా చెప్పిన చిల్లర కష్టాలపై ఏపీ ప్రభుత్వం తగు రీతిలో రియాక్ట్ అయితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీలో కూర్చున్న మోడీ పెద్దనోట్లను రద్దు చేసినా.. దాని ప్రభావం గల్లీలోని వారు పడుతున్న వేళ.. వారి కష్టాల్ని తీర్చేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రజలకు అండగా ఉంటే మంచిదన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తిస్తే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/