Begin typing your search above and press return to search.

కాల్వ శ్రీనివాసులపై దావా వేయమంటున్న రోజా

By:  Tupaki Desk   |   28 Jan 2016 8:00 AM GMT
కాల్వ శ్రీనివాసులపై దావా వేయమంటున్న రోజా
X
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనను అవమానపరిచేలా మాట్లాడారంటూ రోజాపై ఆమె రూ.కోటికి పరువు నష్టం దావా వేశారు. అయితే.. రోజా దానిపై స్పందిస్తూ అనిత దావా వేయాల్సింది తనపై కాదని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులపై ఆమె దావా వేయాలని సూచించారు.

అనిత పరువు తీసింది తాను కానని, తెలుగుదేశం పార్టీయే ఆమె పరువు తీసిందని రోజా అంటున్నారు. అనిత వేసిన తనపై కోటి రూపాయల పరువు నష్టం దావాపై ఆమె స్పందిస్తూ,తనకు నోటీసు వస్తే ఎదుర్కుంటానని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆమెను బలిపశువుగా వాడుకుంటోందని అన్నారు. ఇందుకు తాను కూడా బాదపడుతున్నానని పాపం మొసలి కన్నీరు కూడా కార్చారు.

అసెంబ్లీ అంశాలు అంటూ సభలో దృశ్యాలను మీడియాకు విడుదల చేసింది ఛీప్ విప్ కాల్వ శ్రీనివాసులు కాబట్టి ఆయన వల్లే అనిత పరువు పోయిందని... ప్రజలందరికీ విషయం తెలిసిందని.. కాబట్టి ఆమె కేసు వేయాల్సింది కాల్వ శ్రీనివాసులపైనేనని అంటున్నారు. మొత్తానికి ఇంత జరిగినా రోజా మాత్రం ఏమాత్రం మారినట్లుగా లేదు.