Begin typing your search above and press return to search.
జగన్ రాకతో... ఏపీలో రామరాజ్యమేనట!
By: Tupaki Desk | 5 April 2017 5:01 PM ISTరాముడి పాలన... ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మనం చూడలేకపోయినా... సుపరిపాలన ఒక్క రాముడి హయాంలోనే కొనసాగిందన్న మాట ప్రతి ఒక్కరూ అంగీకరించే మాటే. మరి నాటి రాముడి పాలన ఇప్పుడు సాధ్యమేనా? అంటే... ఎందుకు సాధ్యం కాదంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. పదేళ్ల క్రితం నాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో రామరాజ్యం కొనసాగిందని, అదే వైఎస్ పాలన అని కూడా ఆమె చెబుతున్నారు.
మరి వైఎస్ అకాల మరణం చెందిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి నవ్యాంధ్రలో ఎలాంటి పాలన సాగుతుందో పరిశీలించండి అంటూ ఆమె ఒంటిమిట్ట రాములోరి సాక్షిగా చెప్పిన మాటలు ఆసక్తిగానే ఉన్నాయి. వైఎస్ పాలన రామరాజ్యాన్ని తలపించిందని... ఒక్క రోజానే కాదు సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు. 108, ఆరోగ్యశ్రీ సేవల గురించి ప్రస్తావించిన సందర్భంగా అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్.. వైఎస్ పాలనను ఆకాశానికెత్తేశారు. మంచి ఎవరు చేసినా మంచి అనే పొగడుతామంటూ... నాడు వైఎస్ పాలనను ఆయన కీర్తించకుండా ఉండలేకపోయారు.
ఇక తాజా విషయానికి వస్తే... ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరుగుతున్న రాములోరి కల్యాణానికి హాజరైన సందర్భంగా స్వామి వారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఏపీలోనూ రాములోరి పాలన వస్తుందని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేయడం ఖాయమేనని ఆమె చెప్పారు. జగన్ పాలన రాముడి పాలన మాదిరే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కూడా ఆమె చెప్పారు. జగన్ ను శ్రీరాముడితో పోల్చిన రోజా... రాముడి తరహాలోనే జగన్ కూడా ఏపీలో సుపరిపాలనను పట్టాలెక్కిస్తారని జోస్యం చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/