Begin typing your search above and press return to search.
ఎగ్జిట్ పోల్స్ రోజాను టెన్షన్ పెడుతున్నాయే
By: Tupaki Desk | 22 May 2019 9:07 AM ISTసార్వత్రిక ఎన్నికలు ముగిసీ ముగియగానే... వరుసగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ జాతీయ స్థాయిలో వన్ సైడెడ్ రిజల్ట్ ను చెప్పేసింది. వెరసి కేంద్రంలో బీజేపీలో జోష్ పెరగగా, కాంగ్రెస్ లో నైరాశ్యం అలముకుంది. అయితే అందుకు భిన్నమైన పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి. సార్వత్రికంతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎగ్జిట్ తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడిపోయాయి. ఈ పోల్స్ లో మెజారిటీ సర్వే సంస్థలు విపక్ష వైసీపీదే గెలుపు అని చెప్పేశాయి. లగడపాటి సహా ఓ మూడు సంస్థలు మాత్రం టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పాయి.
ఈ నేపథ్యంలో ఆది నుంచి విజయంపై ధీమాతోనే ఉన్న వైసీపీ... ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో మరింత ధీమాగా కనిపిస్తోంది. అయితే వైసీపీలో కీలక నేతగా, వైసీపీ అధికారంలోకి వస్తే... జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా - అది కూడా హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని భావిస్తున్న నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే - వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా పరిస్థితి మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే.... ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పినా... రోజా మాత్ర ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇప్పుడు ఇదే అంశం ఏపీలో వైరల్ చర్చగా మారిపోయింది. అయినా వైసీపీ గెలుస్తున్నా... రోజా ఎందుకు ఓడిపోతారన్న కారణాలను కూడా విశ్లేషించిన ఎగ్జిట్ పోల్స్... ఆసక్తికర అంశాలను చెప్పాయి.
ఎమ్మెల్యేగానే రోజా ఓ రేంజిలో దూసుకుపోతూ ఉంటే... ఇక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే... ఆమె దూకుడుకు అంతే ఉండదన్నది అందరిలో వ్యక్తమవుతున్న భావన. ఈ భావన ఇటు టీడీపీతో పాటు అటు వైసీపీలోనూ ఉందట. దీంతో నగరిలో వైసీపీకి చెందిన కీలక నేత - కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కావాలనే రోజా ఓటమి కోసం పనిచేశారట. ఇది ఓ కారణమైతే... గడచిన అసెంబ్లీలో అత్తెసరు మెజారిటీతోనే గెలిచిన రోజా... టీడీపీని ఏ మేర ఇబ్బంది పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీలో రోజాను నిలువరించే టీడీపీ నేతే కనిపించక చంద్రబాబు నానా తంటాలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దఫా కూడా రోజా గెలిస్తే... అసెంబ్లీలో టీడీపీకి మరింత ఇబ్బందేనని భావించిన చంద్రబాబు... నగరిపై ప్రత్యేక దృష్టి సారించి రోజా ఓటమి కోసం పక్కా ప్లాన్ ను రచించారట.
ఇక ఇటీవలే మరణించిన టీడీపీ దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం పట్ల నియోజకవర్గంలో సానుభూతి ఉంది. ఈ సానుభూతిని క్యాష్ చేసుకుని రోజాకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు.. గాలి కుమారుడిని బరిలోకి దింపారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీ గెలిచి రోజా ఓడిపోతే... అది పెను సంచలనమే అవుతుంది. అయితే రోజా మాత్రం ఈ తరహా విశ్లేషణలను కొట్టిపారేస్తూ... తాను ఈ దఫా కూడా విజయం సాధించి తీరతానన్న ధీమాతోనే ఉన్నారు. చూద్దాం... మరి ఏం జరుగుుతుందో.