Begin typing your search above and press return to search.

ఏమైనా ఇలాంటివి రోజాకే సాధ్యం

By:  Tupaki Desk   |   9 March 2021 4:10 AM GMT
ఏమైనా ఇలాంటివి రోజాకే సాధ్యం
X
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండవని చెబుతుంటారు. అందుకు తగ్గట్లే కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. మొండితనంలో తనకు మించినట్లు మరెవరూ ఉండరన్నట్లుగా ఉండే స్ట్రాంగ్ ఉమెన్ ఆర్కే రోజా. నగరి ఎమ్మెల్యేగా.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేతగా ఆమె సుపరిచితురాలు. కీలకమైన మంత్రిత్వ శాఖను సొంతం చేసుకుంటారని భావించినా.. జగన్ సర్కారులో ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి దక్కింది.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోసొంత పార్టీ నేతలు పలువురితో ఆమెకు పడదు. రాజకీయ అధిపత్యం కోసం వీరి మధ్య అంతర్గత కుమ్ములాటలుచోటుచేసుకుంటుంటాయి. చిత్తూరుజిల్లాలోరాజకీయ అధిక్యం కోసం ఆమెకు పలువురునేతలు అడ్డుగా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకోవటానికి కూడా వెనుకాడరు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగినా ఇప్పటివరకు అవేమీ ఫలించలేదు.

అలాంటిది తాజాగా జరుగుతున్న పురుపోరులో అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవహరించారు ఆర్కే రోజా. డిఫ్యూటీ సీఎం నారాయణస్వామి నీడ అంటేనే పొసగని రోజా.. అందుకు భిన్నంగా ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారాన్నినిర్వహించటం విశేషంగా మారింది. జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం గురించి సీఎం జగన్ కు సమాచారం అందిందా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. గతంలో స్థానిక ఎమ్మెల్యే అయిన తాను లేకుండా తన నియోజకవర్గ సమీక్ష ను నిర్వహించిన నారాయణస్వామి తీరును ఆర్కే రోజా తీవ్రంగా తప్పుపట్టారు.

తర్వాతి కాలంలో ప్రోటోకాల్ తో సహా పలు అంశాలు ఈ ఇద్దరు నేతల మధ్య దూరాన్ని పెంచాయి. తెర వెనుక ఏం జరిగిందో కానీ.. తెర మీద మాత్రం ఈ ఇద్దరునేతలు కలిసి ఒకే వాహనంలో పక్కపక్కనే నిలబడి నవ్వుతూ ప్రచారం చేసిన తీరు ఆకట్టుకోవటమే కాదు.. ఈ వీడియోను సీఎం జగన్ చూస్తే మాత్రం కచ్ఛితంగా సంతోషపడతారని చెప్పక తప్పదు