Begin typing your search above and press return to search.

బ్యాంక్ మేనేజర్ కు షాకిచ్చిన రోజా

By:  Tupaki Desk   |   13 Nov 2016 7:11 PM IST
బ్యాంక్ మేనేజర్ కు షాకిచ్చిన రోజా
X
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయంతో ప్రజలు పడుతున్న పాట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రియాక్ట్ అయ్యారు. రెండు రోజుల కిందట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏటీఎం సెంటర్లో నిలుచొని డబ్బులు తీసుకున్న వైనాన్ని చూసి స్ఫూర్తి పొందారో ఏమో కానీ.. తాజాగా ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఎస్ బీఐ బ్యాంకుకు వెళ్లారు.

సామాన్య ప్రజలతో పాటు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు క్యూలో నిలుచున్నారు. అయితే.. ఏటీఎంలో డబ్బులు లేవని.. నిండుకున్నాయని తెలుసుకున్న ఆమె.. బ్యాంకు లోపలికి వెళ్లి.. మేనేజర్ ను నిలదీశారు. పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ప్రభుత్వం చెప్పించి కదా? అందుకు తగ్గట్లు చర్యలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు.

స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి సూటిగా నిలదీయటం.. ప్రశ్నల వర్షం కురిపించటంతో సదరు బ్యాంకు మేనేజర్ బిక్కముఖం వేసిన పరిస్థితి. రోజా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండి మిన్నకుండిపోయారు. తన లాంటి వారే నగదు కోసం ఇబ్బంది పడుతుంటే.. సామాన్యుల ఇబ్బందులు ఎంతగా ఉంటాయో తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. నల్లకుబేరులకు ముందస్తుగానే సమాచారం ఇవ్వటంతో వారంతా సంతోషంగా ఉన్నారని.. సామాన్యలకే కష్టాలన్నీ ఆమ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ అధికారపక్ష నేతలపై దుమ్మెత్తిపోశారు.

కేంద్రం చేసింది మంచిపనే అయినా.. పక్కా ప్రణాళికతో కేంద్రం వ్యవహరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేసి ఉంటే బాగుండేదన్న ఆమె.. ముందస్తు సమచారం లేకుండా పెద్దనోట్లను రద్దు చేయటంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నట్లుగా పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి.. బ్యాంకు మేనేజర్ల పాత్ర పరిమితమని.. బ్యాంకుల్లోనోట్ల లభ్యత అన్నది కూడా వారి చేతుల్లో ఉండదన్న విషయం తెలిసి కూడా రోజా.. వారిపై విరుచుకుపడటం గమనార్హం. ఇక.. పెద్దనోట్ల రద్దుపై ఎవరికీ సమాచారం అందించకుండానే మోడీ వ్యవహరించారని చెబుతున్నా.. తమ రాజకీయ ప్రత్యర్థులపై రోజా దుమ్మెత్తి పోయటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/