Begin typing your search above and press return to search.
ఇద్దరు సీఎంలపై రోజా అటాక్
By: Tupaki Desk | 17 May 2016 4:00 PM ISTచింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా టీడీపీతో రాజకీయ - న్యాయ పోరాటాల్లో ఓటమి పాలైన వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. పనిలో పనిగా ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా మండిపడ్డారు. చంద్రబాబుకు ఇప్పటికే కేసీఆర్ చుక్కలు చూపించారని.. మళ్లీ అక్రమ సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ తో తలపడితే ఇంకోసారి ఇరుకునపెడతారన్న భయంతోనే ఆయన దీనిపై స్పందించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విజయం సాధించాలనుకున్న చంద్రబాబు కుయుక్తులను కేసీఆర్ అడ్డుకున్నారని.. ఆందుకు సంబంధించిన పక్కా ఆడియో - వీడియో సాక్ష్యాలను సంపాదించి, ఆపై చంద్రబాబుపై ఒత్తిడిని పెంచడం ద్వారా 'బాహుబలి పార్టు-1'ను చూపించారని సెటైర్లు వేశారు. ఆ దెబ్బకు చంద్రబాబు భయపడి హైదరాబాద్ నుంచి మూట ముల్లె సర్దుకున్నారని, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ అసెంబ్లీకి రావద్దని కేసీఆర్ చెప్పడంతోనే హడావుడిగా సచివాలయం నిర్మాణ పనులను వెలగపూడిలో చేపట్టారని విమర్శించారు. ఇక కేసీఆర్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఒక్క విమర్శ చేసినా ఆయనకు 'బాహుబలి పార్టు-2' కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరెత్తడం లేదని విమర్శించారు.
అదే సమయంలో రోజా కేసీఆర్ పైనా ఆరోపణలు చేశారు. ఎగువ ప్రాంతంలో కేసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టులతో కర్నూలు - అనంతపురం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ ఆంధ్రా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్న ఆమె కేసీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు కూడా దిగువకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలని ప్రశ్నించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికి పోవడమేనని విమర్శించారు.
కేసీఆర్ ను చంద్రబాబు ఒక్క మాటన్నా, సాక్ష్యాలతో సహా వచ్చి ఆయన్ను జైల్లోకి పంపుతారని, అందువల్లే చంద్రబాబు లాలూచీ పడి ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ సైతం పక్క ఏపీపై ద్వేషాన్నే ప్రదర్శిస్తున్నారని.. ఈ పద్ధతి కరెక్టు కాదని, ఆయన దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు.