Begin typing your search above and press return to search.

బాబును సెటిల్‌మెంట్‌ మినిస్టర్‌ అంటున్న రోజా

By:  Tupaki Desk   |   11 July 2015 4:02 PM IST
బాబును సెటిల్‌మెంట్‌ మినిస్టర్‌ అంటున్న రోజా
X
అసలే ఫైర్‌బ్రాండ్‌.. ఆపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడే అవకాశాలు వచ్చాయి. ఇంక ఊరుకుంటారా? ఉతికి ఆరేయరు. అలానే ఉంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా పరిస్థితి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పలు అంశాలపై తాజాగా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాబు వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే చూస్తే..

''సీఎం అంటే సెటిల్‌మెంట్‌ మినిస్టర్‌ అని చంద్రబాబు రుజువు చేశారు. ఆయన్ను చూసి మహిళలు తల దించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మహిళల పట్లఎవరైనా వెధవ వేషాలు వస్తే తాట తీస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయనే వెధవ వేషాలేస్తున్నారు. ఇప్పుడు ఆయన తాట తీయాలా?''

''బెల్ట్‌షాపుల నిషేధం అని చెప్పిన చంద్రబాబు.. ప్రతి వీధిలో మాల్స్‌లో మద్యం అమ్మిస్తున్నారు. ప్రశ్నించిన మహిళల్ని అరెస్ట్‌ చేయించారు. రాజధానికి భూములు ఇవ్వమని చెప్పిన సుధారాణిని భయపెట్టారు''

''ఎమ్మెల్యే అఖిలప్రియపై దురుసుగా ప్రవర్శించిన పోలీసుల్ని ప్రశ్నించిన భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. చూస్తుంటే.. మహిళల్ని చంద్రబాబు తొక్కేయాలని చూస్తున్నారు''

''ఎమ్మార్వో వనజాక్షిని భయపెట్టటం వల్లనే ఆమె మాట్లాడకుండా వెళ్లిపోయింది''

''ఇంటెలిజెన్స్‌ డీజీ అనురాధ విషయంలో బాబు దారుణంగా వ్యవహరించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు.. అనురాధపై బదిలీ వేటు వేశారు''

''అధికారుల్ని.. వనజాక్షిని.. దొంగల్ని కూర్చోబెట్టిన సీఎం సెటిల్‌మెంట్‌ చేయటం ఏమిటి? మహిళా అధికారిణిపై దాడి జరిగితే మంత్రివర్గంలోఉన్న ముగ్గురు మహిళా మంత్రులు ఆమెకు ఎందుకు సంఘీభావం తెలపలేదు''

''సీఎం సొంత జిల్లా చిత్తూరులో కూడా మహిళా ఎమ్మార్వో నారాయణమ్మపై టీడీపీ నేతలు దాడులకు దిగారు''

''ట్యాపింగ్‌ తప్పన్న బాబు.. ఇప్పుడు ఆ ట్యాపింగ్‌ టెక్నాలజీని కోట్లు ఇచ్చి కొంటున్నారు? ఆ ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలు వివాదంపై సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలి''