Begin typing your search above and press return to search.
కులాలమధ్య చిచ్చు పెట్టిన వారిని చెప్పుతో కొట్టవద్దా?
By: Tupaki Desk | 29 July 2017 7:19 PM ISTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మంత్రులు చేస్తున్న ఆరోపణలు చూస్తే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. రెండు నెలల నుంచి పొద్దు ఎరగని బిక్షగాళ్లలాగా టీడీపీ నేతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప నంద్యాలలో కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. దొంగ ఓటర్లను చేర్పించి ఉప ఎన్నికలో గెలవాలని కుట్ర చేస్తే ఎలక్షన్ ఏ విధంగా తెర దించిందో చూశామన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు.
ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు కులం పేరుతో రాజకీయం చేస్తే చెప్పుతో కొట్టండి అన్న వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తిప్పి కొట్టారు. రాష్ట్రంలో కులాల పేరుతో రాజకీయాలు చేసేది చంద్రబాబే అని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు మనిషిగా ఎత్తు పెరిగారు గానీ, బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు. కులం పేరుతో రాజకీయాలు చేసే వారిని చెప్పుతో కొట్టాలనే విషయాన్ని చంద్రబాబుకు చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని రోజా గుర్తు చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో ఆయా కులాలకు హామీలు ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టింది మీరు కాదా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని ఏ విధంగా ఉక్కుపాదంతో అణచివేస్తున్నారో, కులాల మధ్య చిచ్చు పెట్టిన వారిని చెప్పుతో కొట్టాలా వద్దా అన్నారు. డీజీపీ సాంబశివరావును ఆయన కులం చూసి పూర్తి బాధ్యతలు ఇవ్వకుండా అవమానించింది మీరు కాదా?, సీఎస్ నియమాకాల్లో అజయ్ కల్లంకు అన్యాయం చేసింది ఎవరని నిలదీశారు. శ్రీకాకుళం జిల్లాలో తనకు గిట్టని 122 మంది కలింగ ఉద్యోగులను మంత్రి అచ్చెన్నాయుడు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి వారిని ఏవిధంగా బదిలీ చేశారో అందరికి తెలుసు అన్నారు. అలాంటి వ్యక్తిని దేంతో కొట్టాలని రోజా ప్రశ్నించారు.
సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని రోజా అన్నారు. గతంలో నందిగామ ఎమ్మెల్యే చనిపోతే వైఎస్‌ఆర్‌సీపీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. భూమా నాగిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచారని, మా పార్టీ ఎమ్మెల్యే చనిపోతే మీరు సిగ్గులేకుండా పోటీకి వచ్చారని విమర్శించారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన వారో స్పీకర్ కోడెల శివప్రసాదరావును అడిగితే సమాధానం చెబుతారని ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలకు చురకలంటించారు. పచ్చ కండువాలు వేసుకున్నంత మాత్రానా వారు టీడీపీ ఎమ్మెల్యేలు కాలేరన్నారు. నంద్యాలలో టీడీపీ నేతలు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి పసుపు కుంభకోణం జరుగుతుంటే ఏం చేశారని నిలదీశారు. ఆయన, మరో ఎమ్మెల్యే ఏ విధంగా రైతులను దోచుకున్నారో అందరికి తెలుసు అన్నారు. ఆగస్టు 3న వైయస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలకు వస్తున్నారని, మీ మాటలకు ఆయనే సమాధానం చెబుతారన్నారు.
చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్లు 21మంది ఎమ్మెల్యేలను కొని ఇప్పుడు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని రోజా డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రులుగా చెలామణి అవుతున్న ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిలకు సిగ్గుండాలని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లు వైఎస్ జగన్‌కు నీతి లేదు అని విమర్శిస్తున్నారని తప్పుపట్టారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలను ఆయన ఇంట్లో వాళ్లు కూడా అసహ్యంచుకుంటారన్నారు. ఆదినారాయణరెడ్డి నిజంగా రాయలసీమలో పుట్టి ఉంటే.. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఎన్‌టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్క రూపాయి పెట్టి సభ్యత్వం తీసుకున్నానని చెబుతూ, ఆ తరువాత వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరానని చెప్పుతూ మంత్రి అమరనాథరెడ్డి, తన శీలాన్ని తానే పొగొట్టుకున్నారని తెలిపారు. నంద్యాలలో వైఎస్‌ఆర్‌సీపీ అభివృద్ధిని అడ్డుకుంటుందని వీళ్లు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. పార్టీ ఫిరాయించిన 21 నియోజకవర్గాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. టీడీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని , ఉప ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పార్టీ మారిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకొనే ఉద్దేశం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని, పార్టీ మారిన నేతలు తిరిగి వస్తామని అడిగినా అధినేత అంగీకరించలేదని రోజా తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓటమి ఖాయమని రోజా పేర్కొన్నారు.
ఉద్యోగులకు పెర్ఫార్మెన్సు నిబంధనలు పెడుతున్న చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను మంత్రిని ఎలా చేశారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. చంద్రబాబు కక్షసాధింపు చర్యలతో రాష్ట్రంలోని ఉద్యోగస్తులు సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు డీఏ ఇవ్వలేదని, ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. బాబు మేక వన్నే పులి అని ఇప్పటికైనా అర్థమైందని తెలిపారు. ఆయన నిజ స్వరూపాన్ని ఉద్యోగులు తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత లేదని ఉద్యోగస్తులను తొలగించాలనే కుట్రలో భాగంగానే ఫెర్ఫామెన్సు నిబంధనలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పెర్ఫామెన్సు ను చూసి లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారని రోజా నిలదీస్తూ.....``జయంతికి, వర్ధంతికి తేడా తెలియనందుకా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ చేసినందుకా?`` అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్న పేరును మళ్లీ సార్థకం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని పట్టుబట్టారు. ఉద్యోగులను భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు. ఉద్యోగులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని రోజా తెలిపారు.