Begin typing your search above and press return to search.
బాబుపై మోడీకి కంప్లయింటు చేస్తానంటున్న రోజా
By: Tupaki Desk | 28 Jun 2016 4:05 PM ISTఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ప్రధాని మోడీకి కంప్లయింటు చేస్తానని వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అంటున్నారు. నవ్యాంద్ర రాజధాని నిర్మాణం నుంచి మిగతా అన్ని అంశాల్లోనూ బినామాలను పెట్టుకుని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారంటూ చంద్రబాబుపై ఆమె మండిపడ్డారు. పెదబాబు చంద్రబాబు - చినబాబు లోకేశ్ బాబు బినామీ పేర్లతో రాజధాని భూములను దోచుకుంటున్నారని.. చంద్రబాబుది తెలుగు దేశం పార్టీ కాదు.. తెలుగు దొంగల పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. తెలుగోడి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్‌కి తాకట్టు పెడుతోందని మండిపడ్డారు.
టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రయోజనాలపై కేంద్రంతో పోరాడే స్థితిలో లేదని ఆరోపించిన ఆమె ప్రజలు - రైతులను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో సీఎం చంద్రబాబు ఆడుకుంటున్నారని.. స్విస్ ఛాలెంజ్ విధానంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. ఏపీని చంద్రబాబు తెల్లదొరల చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. స్విచ్ చాలెంజ్ పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని గుర్తు చేశారు.
చంద్రబాబు ఒక్కరినే కాకుండా ఏపీ మంత్రులనూ రోజా విమర్శించారు. మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని.. చంద్రబాబు వారిని ఆడిస్తున్నారని.. చంద్రబాబు చెప్పినదానికి కల్లా గంగిరెద్దుల్లా తలాడిస్తూ ప్రజలను మంత్రులు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్విచ్ చాలెంజ్ పద్ధతిని అడ్డుకునేందుకు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని రోజా చెప్పారు.