Begin typing your search above and press return to search.
బాబు.. సీట్ల గురించేనా? హోదా వద్దా?
By: Tupaki Desk | 13 Jan 2018 11:34 AMఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్యూ ఏదైనా వస్తే.. దానిపై అధ్యయనం చేసి మాట్లాడటం ఒక ఎత్తు. కానీ.. తన మాటలతో ఇష్యూతో మసాలా దట్టించినట్లుగా మాట్లాడి మంట పుట్టించే తత్త్వం రోజా సొంతం. తాజాగా ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన నేపథ్యంలో.. వారి సమావేశ వివరాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
మోడీతో తానేం మాట్లాడానన్న విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పిన నేపథ్యంలో.. ఆయన మాటల్ని తీవ్రంగా తప్పు పట్టారు రోజా. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని కోరుతుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సీట్ల పెంపు గురించి మాట్లాడటం తప్పన్నారు. ప్రధాని మోడీతో బాబు భేటీ కారణంగా ఏపీకి ఎలాంటి లాభం లేదని తేల్చారు.
చంద్రబాబు తాను కేసుల నుంచి తప్పించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలే తప్పించి.. ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపించట్లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు అసెంబ్లీలో సీట్ల పెంపు ఒక్కటే సమస్యగా కనిపిస్తోందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అవసరమా? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు పెంచుకోవటం ముఖ్యమా? అంటూ సూటి ప్రశ్నను సంధించిన రోజా.. బాబు తీరు ఏ మాత్రం బాగోలేదన్నారు. మోడీతో భేటీ అయిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా సీట్లు పెంచే విధానాన్ని తాను మోడీతో చెప్పినట్లుగా చెప్పారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన రోజా బాబు తీరును తీవ్రంగా తప్పు పట్టారు.